జార్ఖండ్‌ కాల్పుల్లో ఖమ్మం వాసి మృతి.. బ్యాంక్‌ పనిపై వాహనంలో వెళ్తుండగా

Khammam Man Died In Jharkhand Shooting Incident - Sakshi

ఖమ్మం అర్బన్, హుడాకాంప్లెక్స్‌(హైదరాబాద్‌): జార్ఖండ్‌ రాష్ట్రంలోని హాజరీబాగ్‌ జిల్లాలో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఖమ్మం ఇందిరానగర్‌కు చెందిన వీరగంధం శరత్‌బాబు(60) మృతి చెందారు. బర్కాగావ్‌లో ఎన్‌టీపీసీలో మైనింగ్‌ పనుల కోసం ఓ కంపెనీ తరఫున ఆయన జనరల్‌ మేనేజర్, ప్రాజెక్టు కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం సైట్‌ ఆఫీసు నుంచి బ్యాంక్‌ పనిపై వాహనంలో వెళ్తుండగా గెస్ట్‌ హౌస్‌ దగ్గర ఇద్దరు బైక్‌పై వచ్చిన అగంతకులు కాల్పులు జరపడంలో కుప్పకూలిపోయాడు.

శరత్‌ ఛాతి, కడుపులో రెండు బుల్లెట్లు దూసుకుపోవడంతో ఆయన మృతి చెందాడని, హత్యకు కారణాలు తెలియలేదని హజారీబాగ్‌ పోలీసు సూపరింటెండెంట్‌ మనోజ్‌ రతన్‌ఛోతే ప్రకటించినట్లు వారి కుటుంబీకులకు మంగళవారం సాయంత్రం సమాచారం అందింది. శరత్‌కు భార్య పద్మ, కుమారుడు కార్తీక్‌ ఉన్నారు. శరత్‌ స్వస్థలం నిజామాబాద్‌ జిల్లా కాగా, ఆయన మృతదేహాన్ని హైదరాబాద్‌ తీసుకొచ్చి అక్కడ ఉంటున్న కుమారుడి ఇంటి వద్దే అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు శరత్‌బాబు సమీప బంధువైన ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ ఏలూరి శ్రీనివాసరావు తెలిపారు.
చదవండి: నదిలో పడిన బస్సు.. 24 మంది దుర్మరణం

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top