అరటికాయల మాటున ఎర్రచందనం స్మగ్లింగ్‌  | Crime News: Smuggling Red Sandalwood Over Bananas‌ In Rajampet | Sakshi
Sakshi News home page

అరటికాయల మాటున ఎర్రచందనం స్మగ్లింగ్‌ 

May 29 2022 11:53 PM | Updated on May 29 2022 11:53 PM

Crime News: Smuggling Red Sandalwood Over Bananas‌ In Rajampet - Sakshi

పట్టుబడిన దుంగలు, ముద్దాయిలతో రాజంపేట ఎఫ్‌ఆర్‌ఓ నారాయణ   

రాజంపేట: కడప–రేణిగుంట జాతీయరహదారిలోని రామాపురం చెక్‌పోస్టు వద్ద అరటికాయల మాటున ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేస్తుండగా అటవీ పోలీసులు పట్టుకున్నారు. ఈ విషయాన్ని రాజంపేట ఫారెస్టు రేంజర్‌ నారాయణ శనివారం విలేకరులకు వెల్లడించారు. బొలోరో వాహనంలో అరటికాయల లోడు వస్తుండగా, ఆపి వాహనాలను తనిఖీ చేశామన్నారు. అందులో ఎర్రచందనం దుంగలు గుర్తించామన్నారు. ఇందుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అదుపులో తీసుకున్నామన్నారు.

దుంగలను వత్తలూరు నుంచి తీసుకువస్తున్నట్లుగా వారు తెలిపారన్నారు. ఆరు ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను కోర్టుకు హాజరుపరిచామన్నారు. పట్టుబడినవారిలో రాజంపేట మండలం డీబీఎన్‌పల్లెకు చెందిన కసిరెడ్డి నాగార్జునరెడ్డి, వత్తలూరుకు చెందిన రెడ్డయ్య, రాయచోటికి చెందిన వెంకటరమణల ఉన్నారన్నారు. కార్యక్రమంలో ఎఫ్‌ఎస్‌ఓ శ్రీనివాసులు, అటవీ సిబ్బంది అంజనాస్వాతి, సాయికుమార్‌ పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement