ఇంతన్నాడంతన్నాడే..! | - | Sakshi
Sakshi News home page

ఇంతన్నాడంతన్నాడే..!

Apr 14 2026 7:58 AM | Updated on Apr 14 2026 7:58 AM

● ఆడబిడ్డ నిధి అంటూ ప్రగల్భాలు ● గెలిచాక పంగనామాలు ● మండిపడుతున్న మహిళలు

బాబు ఆర్భాటపు హామీలు

బాబు మాటల గారడీకి మహిళలు పడిపోయారు. గత ఎన్నికల్లో ఆయన ఇచ్చిన హామీల వర్షంలో తడిసి ముద్దయ్యారు. ఆడ బిడ్డ నిధి అంటూ ఊదరగొట్టేసరికి మురిసిపోయారు. త్రీబెడ్‌ రూమ్‌ ఇళ్లు అని చెప్పేసరికి సంతోషసాగరంలో మునిగిపోయారు. తీరా గెలిచాక బాబు విశ్వరూపాన్ని చూసి గాబరాపడుతున్నారు. ఆడ బిడ్డ నిధి ఎక్కడ బాబూ అంటూ నిలదీస్తున్నారు. ఇందుకేనా మీకు ఓట్లు వేసిందంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. జిల్లాలో మహిళల ఆవేదన.. ఆక్రోశంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.

ఆత్మస్తుతి, పరనిందకే పెద్దపీట

చంద్రబాబుది అంతా డైవర్షన్‌ రాజకీయం. తిరుపతి లడ్డూ నుంచి

అన్ని అంశాలలో అతనిది అదే పంథా. ఆత్మస్తుతి, పరనిందకే పెద్దపీట. గత ప్రభుత్వ వైఫల్యమని నిందలు వేస్తూ, తన వైఫల్యాన్ని

కప్పిపుచ్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు

గమనిస్తున్నారు. హామీల బాబు, రాష్ట్రాన్ని అప్పుల కుప్ప

చేస్తున్నారని విమర్శలు ఎక్కుపెడుతున్నారు.

కార్వేటినగరం: గత అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలలో ఆడబిడ్డ నిధి పథకం ఒకటి. ఆ పథకం కింద 18 నుంచి 59 సంవత్సరాల లోపు మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున వారి బ్యాంకు ఖాతాలో నేరుగా జమచేస్తామన్నది ప్రధానమైంది. ఆ హామీ తో మహిళలు కొంత మేర టీడీపీ వైపు మొగ్గు చూపారు. తీరా ఓట్లు దండుకుని గెలిచాక ఆ హామీని పక్కనబెట్టేశారు. దీనిపై మహిళలు మండిపడుతున్నారు.

ఇంటి జాగా లేదు గానీ!

చమద్రబాబు సర్కార్‌ వచ్చి రెండేళ్లు పూర్తికావస్తోంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ రెండు సెంట్లు ఇంటి స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు ఆ ఊసే లేదు. ఇప్పుడు పెద్ద కుటుంబానికి త్రీ బెడ్‌రూమ్‌ ప్లాట్‌ ఇస్తానని హామీ ఇస్తున్నారు. అభివృద్ధిని గాలికి వదలేసి సమస్యలకు సంబంధించి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఇలాంటి మాయ మాట లు చెప్పడం బాబుకు అలవాటయ్యిందని ప్రజలు మండిపడుతున్నారు. ఇదేనా బాబు విజనరీ అని ఎద్దేవా చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement