
ముగ్గురు యువకులకు గాయాలు
కుప్పంరూరల్: వేగంగా వచ్చి కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు తమిళనాడు యువకులు గాయపడ్డారు. ఈ ఘటన శనివారం ఉదయం కుప్పం మండలం, నాయనూరు అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాలు.. తమిళనాడు వాణియంబాడీకి చెందిన మతిన్, సల్మాన్, వసీవుల్లాలు వాణియంబాడీ నుంచి ద్విచక్ర వాహనంలో నాయనూరు మీదుగా కుప్పం వస్తున్నారు. నాయనూరు అటవీ ప్రాంతం దిబ్బరేవు సమీపంలోకి రాగానే ఎదురుగా వచ్చిన ఇన్నోవా వాహనం వేగంగా వచ్చి యువకులు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ప్రమాదం జరగగానే కారు డ్రైవర్ పరారయ్యాడు. ప్రమాదంలో గాయపడ్డ యువకులను కంగుంది పీహెచ్‌సీకి తరలించారు.
డిటోనేటర్లు, జిలెటిన్‌స్టిక్‌లు స్వాధీనం
పుంగనూరు: మండలంలోని భీమగానిపల్లె వద్ద చట్టవిరుద్ధంగా డిటోనేటర్లు, జిలెటిన్‌స్టిక్‌లు తీసుకెళ్తున్న ఇద్దరిపై కేసు నమోదు చేసి, వాటిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సుబ్బరాయుడు తెలిపారు. శనివారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ భీమగానిపల్లె వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా మండలంలోని కురప్పల్లెకి చెందిన మణి, గంగాధర్ కలసి ద్విచక్ర వాహనంలో ఆరు డిటోనేటర్లు, జిలెటిన్‌స్టిక్‌లను రాతి గుట్టలు పగులగొట్టేందుకు తీసుకెళ్తుండగా పట్టుబడ్డారన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశామన్నారు.
డివైడర్‌ను ఢీకొని..
ద్విచక్రవాహనదారుడి మృతి
బంగారుపాళెం: మండలంలోని కేజీ సత్రం వద్ద శనివారం చైన్నె– బెంగళూరు జాతీయ రహదారిపై గల డివైడర్‌ను ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పాలసముద్రం మండలం, ఆముదాల గ్రామానికి చెందిన కోదండశెట్టి(54) బెంగళూరులో ఎలక్ట్రీషియన్. నాలుగు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. సొంత పనులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై బెంగళూరుకు బయలుదేరాడు. మార్గమధ్యలో కేజీ సత్రం వద్ద జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన డివైడర్‌ను అదుపుతప్పి ఢీకొట్టాడు. తలకు బలమైన గాయం తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ముగ్గురు యువకులకు గాయాలు