
గ్రామీణులకు నాణ్యమైన వైద్యం
పాలసముద్రం (కార్వేటినగరం) : గ్రామీణులకు నాణ్యమైన వైద్యం అందంఇచాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రం సత్యకుమార్ యాదవ్ సిబ్బందిని ఆదేశించారు. గత ప్రభుత్వంలో హిందూస్థాన్ కోకా–కోలా బేవరేజెస్ (హెచ్‌సీపీబీ) సీఎస్‌ఆర్ ఆధ్వర్యంలో మంజూరైన పీహెచ్‌సీ భవనాన్ని ఎమ్మెల్యే థామస్ సమక్షంలో మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామీణుల ఆరోగ్య సంరక్షణకు హెచ్‌సీసీబీ కట్టుబడి ఉందన్నారు. దీనిపరిధిలో చౌడేపల్లె, శాంతిపురం, తవణంపల్లె, పాలసముద్రం, బుగ్గఅగ్రహరం, బైరెడ్డిపల్లె గ్రామాల్లో ఆరోగ్య శిబిరాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. అనంతరం స్థానిక ఏఎన్‌ఎంలు స్టాప్‌నర్సుగా పదోన్నతి కావాలని మంత్రికి విన్నవించారు. డీఎంహెచ్‌ఓ సుధారాణి, డీఐఓ హనుమంతరాజు, పీహెచ్‌సీ కమిటీ చెర్మన్ ఎస్.శివప్రకాష్‌రాజు, కోకా కోలా జీఎం హిమాంచుప్రయదర్శి, వైద్యాధికారులు మోహన్‌క్రిష్ణ, జయకుమార్, సీహెచ్‌ఓ సుబ్రమణ్యం, తహసీల్దార్ అరుణకుమారి, ఎంపీడీఓ విద్యావతి, ఎస్‌ఐ చిన్నరెడ్డెప్ప పాల్గొన్నారు.