
నీతి పద్యాలు దారి చూపే నేస్తాలు
చిత్తూరు కలెక్టరేట్ : నీతిపద్యాలు దారి చూపే నేస్తాలవంటివని తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి అధ్యక్షుడు తులసినాథంనాయుడు అన్నారు. బుధవారం నగరంలోని జైహింద్ పాఠశాలలో విద్యార్థులకు నీతి పద్యాల పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. నీతిపద్యాలు నేర్చుకుంటే వ్యక్తిత్వం పెరుగుతుందన్నారు. ఆగస్టు 29వ తేదీన తెలుగుభాషా దినోత్సవంలోపు వంద నీతి పద్యాలు నేర్చుకునే విద్యార్థులకు బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఆ పాఠశాల హెచ్‌ఎం ప్రకాష్, టీచర్లు చంద్రశేఖర్, ముక్తార్ తదితరులు పాల్గొన్నారు.