
గతంలో ఎన్నడూ లేని అభివృద్ధి
గతంలో ఎన్నడూ లేని అభివృద్ధి ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో చూస్తున్నాం. ఈ అభివృద్ధి సీఎం వైఎస్ జగన్ చొరవ వల్లే సాధ్యమయ్యింది. నాడు–నేడు పథకం ప్రవేశపెట్టి లక్షల నిధులు ఖర్చు చేసి, సర్కారు బడుల రూపురేఖలు మార్చేశారు. ఇది అంత సామాన్యమైన పని కాదు. విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిస్తోంది. మా పాఠశాలలను నాడు–నేడు పథకంలో కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దాం. చుట్టు పక్కల ఏ ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలో ఇలాంటి సౌకర్యాలు లేవు. ఈ కారణం వల్లే విద్యార్థుల అడ్మిషన్‌లు గతంలో కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి.
– ఇలియాజ్, హెచ్‌ఎం, ఎంపీపీఎస్ ఉర్దూ, వీ.కోట