
ఇలాంటి సౌకర్యాలు అప్పుడు లేవు
నేను చదువుకునే రోజుల్లో ప్రభుత్వ బడులు ఇలాగా లేవు. అంతెందుకు ఐదేళ్ల క్రితం ఈ పాఠశాలలో ఇలాంటి సౌకర్యాలు లేవు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాతనే ఈ బడులకు మోక్షం వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాడు – నేడు పథకం మా పిల్లల జీవితాలను మారుస్తోంది. కీలపట్ల జెడ్పీ హైస్కూల్లో నాడు నేడు పథకంలో అన్ని సౌకర్యాలు కల్పించారు. లక్షలాది రూపాయలను ఖర్చు చేశారు. మా పిల్లలు ఇక్కడే చదువుతున్నారు. మాలాంటి పేదల పిల్లలను ఉన్నత స్థాయికి తీసుకురావాలన్న ఉద్దేశంతో సీఎం అమలు చేస్తున్న ఈ పథకాలు ఎంతో మేలు చేకూరుస్తున్నాయి. సీఎం జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం.
– చంద్రబాబు, విద్యార్థి తండ్రి, కీలపట్ల, గంగవరం