
మ్యాథ్స్ బీ, స్పెల్ బీ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు
పోటీ ప్రపంచానికి సరైన వేదిక
ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు రాణించేందుకు సబ్జెక్టు పరంగానే కాకుండా అన్ని అంశాల్లో నైపుణ్యం కలిగి ఉండాలి. కొంతమంది విద్యార్థులకు గణితం, ఇంగ్లిష్ అంటే కొంత భయం ఉంటుంది. సరైన విధానంలో వారికి బోధించలేనప్పుడు ఈ భయం మరింత పెరుగుతుంది. ఈ భయాన్ని పోగొట్టేందుకు, వారిలో ఆసక్తి పెంపొందించి చదువులో బాగా రాణించేందుకు సాక్షి నిర్వహిస్తున్న మ్యాథ్స్‌బీ, స్పెల్‌బీ ఎంతో దోహదపడుతుంది.
– సి.వేణుగోపాల్‌రెడ్డి, చైర్మన్, హోలీగ్రీన్ స్కూల్
తల్లిదండ్రులు ప్రోత్సహించాలి
నేటి సమాజంలో విద్యార్థులు ఉన్నతంగా రాణించగలిగేతేనే జీవితంలో ఉన్నత స్థాయికి చేరగలరు. దీనికోసం పాఠ్యాంశాల్లో ముఖ్యమైన మ్యాథ్స్, ఇంగ్లిష్‌లో పట్టు సాధించగలగాలి. దీన్ని దృష్టిలో ఉంచుకునే సాక్షి మీడియా గ్రూప్ ఏటా మ్యాథ్స్ బీ, స్పెల్ బీ నిర్వహిస్తూ విద్యార్థుల్లోని సృజనాత్మకతను పెంపొందించేందుకు కృషి చేస్తోంది. ఇలాంటి పరీక్షలపై తల్లిదండ్రులు అవగాహన పెంపొందించుకుని తమ పిల్లలను ప్రోత్సహించాలి.
– బి.హరినాథరెడ్డి, డైరెక్టర్, హోలీగ్రీన్ స్కూల్
తిరుపతి ఎడ్యుకేషన్ : సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో ఆదివారం తిరుపతి వేదికగా మ్యాథ్స్‌బీ సెమీ ఫైనల్స్, స్పెల్‌బీ క్వార్టర్ ఫైనల్స్ పరీక్షలు నిర్వహించారు. తిరుచానూరు రోడ్డు, శ్రీనివాసపురంలోని హోలీ గ్రీన్ పాఠశాలలో చేపట్టిన పరీక్షలకు తిరుపతి, చిత్తూరు తదితర ప్రాంతాల్లోని పలు విద్యాసంస్థల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఆ యా పాఠశాలల యాజమాన్యాలతో కలిసి హాజరయ్యారు.
పోటీ ప్రపంచంలో
రాణించేలా..
ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించేందుకు గణితం, ఆంగ్లంపై పట్టు తప్పనిసరి. గణితంలో ఫార్ములాలు, ఆంగ్ల భాషపై పట్టు, ఈ రెండింటిలో నైపుణ్యం ఉంటే ఉన్నతంగా రాణించగలుగుతాం. వీటి ప్రాధాన్యతను గుర్తించిన సాక్షి మీడియా గ్రూప్ గణితం, ఆంగ్ల భాషపై విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తూ వారిని ఆ రెండు సబ్జెక్టుల్లో నైపుణ్యం సాధించేలా ప్రోత్సహించేందుకు రాష్ట్ర వ్యాప్తంగాఏటా మ్యాథ్స్‌బీ, స్పెల్‌బీ పరీక్షలు నిర్వహిస్తోంది. పాఠశాల స్థాయి, క్వార్టర్, సెమీస్, ఫైనల్స్ విభాగాల్లో ఈ పరీక్షలను నిర్వహించి విద్యార్థులను నగదు, ఇతర బహుమతులతో సత్కరిస్తోంది. ఈ ఏడాది ఈ రెండు పరీక్షలకు ప్రధాన స్పాన్సర్‌గా డ్యూక్స్ వేఫి, అసోసియేషన్ స్పాన్సర్‌గా రాజమండ్రికి చెందిన ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవహరిస్తున్నాయి.
మ్యాథ్స్‌బీ సెమీస్...
మ్యాథ్స్‌బీ సెమీ ఫైనల్స్ పోటీలకు విశేష స్పందన లభించింది. ఉదయం 9నుంచి 10గంటల వరకు అన్ని కేటగిరీలకు నిర్వహించిన ఈ పరీక్షకు అధిక సంఖ్యలో విద్యార్థులు హాజరై తమ మేధస్సుకు పదును పెట్టారు.
స్పెల్‌బీ క్వార్టర్ ఫైనల్స్..
పాఠశాల స్థాయి స్పెల్‌బీలో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు క్వార్టర్ ఫైనల్స్ నిర్వహించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12గంటలకు నాలుగు కేటగిరీల్లో జరిగిన పరీక్షకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు తరలివచ్చారు. స్పెల్‌బీ పరీక్ష రాయడానికి విద్యార్థులు ఆసక్తి కనబరిచారు. ఇంగ్లిష్ భాషపై తమకున్న పట్టు, ప్రతిభను పరీక్షించుకున్నారు. స్పెల్‌బీ ద్వారా తమలో నైపుణ్యం, సామర్థ్యం పెరిగిందని, భాషపై పట్టు సాధించుకుంటున్నామని, కొత్త పదాలు, స్పెల్లింగులు, పదాల ఉచ్ఛారణ వంటి సరికొత్త విషయాలు తెలుసుకుంటున్నామని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.
నాలుగు కేటగిరీల్లో..
సాక్షి స్పెల్‌బీ క్వార్టర్ ఫైనల్స్‌లో ఒకటవ కేటగిరీ కింద 1, 2వ తరగతులకు, రెండో కేటగిరీ కింద 3,4వ తరగతులకు, మూడో కేటగిరీ కింద 5, 6, 7వ తరగతులకు, నాలుగో కేటగిరీ కింద 8నుంచి పదో తరగతి వరకు లైవ్ ద్వారా పరీక్షలు నిర్వహించారు. ప్రతిభ చూపిన విద్యార్థులు సెమీఫైనల్ పరీక్షకు అర్హత సాధించనున్నారు.
కార్యక్రమంలో సాక్షి ఈవెంట్స్ ఇన్‌చార్జి టి.చంద్రశేఖర్, ఏడీవీటీ సిబ్బంది భాస్కర్, సుబ్బారావు, అయోధ్యాపురం ధర్మారెడ్డి, పాఠశాల అడకమిక్ డైరెక్టర్ ఓ.మురళి పాల్గొన్నారు.
బాగా ఉపయోగపడింది
స్పెల్‌బీ పరీక్షలో మొదటిసారి పాలొ ్గన్నా. క్వార్టర్ ఫైనల్‌కు చేరడం ఆనందంగా ఉంది. పాఠ్యాంశాల్లోని ఇంగ్లిష్ పదాలతో పాటు స్పెల్లింగ్స్, ఉచ్చారణ తెలిసింది. మరింతగా నైపుణ్యం సాధించేందుకు స్పెల్‌బీ నాకు బాగా ఉపయోగపడింది.
– వి.రోహణ్, 5వ తరగతి, విశ్వం విద్యాసంస్థ, తిరుపతి
ఆసక్తి పెరిగింది
స్పెల్‌బీ పరీక్షలో తొలిసారిగా పాల్గొన్నా. పాఠశాల స్థాయిలో ప్రతిభ కనబరచి క్వార్టర్ ఫైనల్‌కు చేరడం సంతోషంగా ఉంది. ఇంగ్లీష్ భాషపై పట్టు సాధించడంతో పాటు మరింతగా నైపుణ్యం సాధించాలన్న ఆసక్తి పెరిగింది. థ్యాంక్స్ టు సాక్షి.
– ఎ.అర్షిత, 4వ తరగతి, క్యాంఫోర్డ్ స్కూల్, చిత్తూరు
సాధన చేశా
సాక్షి నిర్వహిస్తున్న స్పెల్‌బీ పరీక్షకు బాగా సాధన చేశా. స్పెల్‌బీ మెటీరియల్‌లో చాలా కొత్త పదాలున్నాయి. ఆ పదాలకు స్పెల్లింగ్స్ నేర్చుకున్నా. కొత్త పదాలను ఎలా ఉచ్ఛరించాలి, ఆ పదాలకు అర్థాలను మా ఇంగ్లిష్ టీచర్ నేర్పించారు.
– దియా విశ్వనాథన్, 7వ తరగతి,
ఎడిఫై పాఠశాల,తిరుచానూరు
ఫైనల్స్‌కు వెళ్లడమే లక్ష్యం
స్పెల్‌బీ పరీక్షలకు రెండో పర్యాయం హాజరయ్యా. గత ఏడాది సెమీ ఫైన ల్ వరకు వెళ్లా. ఈ ఏడాది ఎలాగైనా సెమీస్‌లో అర్హత సాధించి ఫైనల్‌కు వెళ్లడమే లక్ష్యం. దీనికోసం స్పెల్‌బీ మెటీరియల్‌ను సాధన చేశా. కొత్త పదాలకు స్పెల్లింగ్‌లు, ఉచ్చారణ తెలుసుకున్నా. స్పెల్‌బీ వల్ల ఇంగ్లిష్ భాషపై పట్టు సాధిస్తున్నా.
– పి.ధనశ్రీ, 7వ తరగతి, జేసీఆర్ చైతన్య స్కూల్, తిరుపతి
కొత్త పదాలు తెలిశాయి
స్పెల్‌బీ పరీక్షలో పాల్గొనడం ద్వారా ఇంగ్లిష్ భాషలోని కొత్త పదాలను తెలిశాయి. ఆ పదాల స్పెల్లింగ్ నేర్చుకున్నా. వాటిని ఎలా ఉచ్ఛరించాలనే విషయాలను మా టీచర్లు నేర్పించారు. స్పెల్‌బీ క్వార్టర్ ఫైనల్ పరీక్ష బాగా రాశా. ఫైనల్‌కు చేరుకోవడమే నా లక్ష్యం.
– ఎస్.లాస్యా రెడ్డి, 4వతరగతి, ప్రశాంత్ ఇంగ్లిష్ మీడియం స్కూల్, తిరుపతి








