
మంత్రి రోజా వితరణగా అందజేసిన నంది వాహనం
నగరి : పట్టణంలోని కామాక్షి సమేత కరకంఠేశ్వరాలయంలో బుధవారం నుంచి పంగుణోత్తర కల్యాణోత్సవ వేడుకలు ప్రారంభంకానున్నాయి. ముందుగా ధ్వజారోహణంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం సూర్యప్రభవాహనం, 30న చంద్రప్రభ వాహనం, ఏప్రిల్ 1వ తేదీన శేష వాహనం, 2న నంది వాహనం, 3న గజవాహనం, 4న రథోత్సవం, 5న కల్యాణోత్సవం, 6వ తేదీన రావణేశ్వర వాహన సేవలు జరిపించనున్నారు. ఈ ఏడాది ఉత్సవాలకు పంచలోహాలతో తయారుచేసిన వాహనాలను వినియోగిస్తుండడం విశేషం. ముఖ్యంగా మంత్రి ఆర్‌కే రోజా రూ.1.5 లక్షల విలువైన నంది వాహనాన్ని అందించా ఆలయ ధర్మకర్త సుబ్రమణ్యం తెలిపారు.