
సతీష్‌కు రూ.3లక్షల చెక్కు అందిస్తున్న ఎమ్మెల్సీ భరత్
కుప్పం/కుప్పంరూరల్ : మండలంలోని ఎన్.కొత్తపల్లెకు చెందిన క్రీడాకారుడు సతీష్‌కు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.3లక్ష సాయం అందింది. మంగళవారం ఈ మేరకు ఎమ్మెల్సీ భరత్ చేతులమీదుగా లబ్ధిదారుడికి చెక్కు అందజేశారు. జాతీయస్థాయిలో కబడ్డీ, వాలీబాల్, హైజంప్ క్రీడల్లో రాణిస్తున్న సతీష్‌కు ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో ఇబ్బంది పడేవాడు. ఈ క్రమంలో ఇటీవల కుప్పం పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి క్రీడాకారుడి దుస్థితిని స్థానిక వైఎస్సార్‌సీపీ నేతలు తీసుకెళ్లారు. దీనిపై ఆయన వెంటనే స్పందించి రూ.3లక్షలు మంజూరు చేశారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి అందించిన సాయంతో మెరుగైన శిక్షణ తీసుకుని అంతర్జాతీయస్థాయిలో సత్తా చాటేందుకు కృషి చేస్తానన్నారు. నగదు ప్రోత్సాహకం మంజూరయ్యేందుకు సహకరించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీలు మిథున్‌రెడ్డి, రెడ్డెప్ప, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ భరత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ మురుగేష్ పాల్గొన్నారు.