
మాట్లాడుతూ ఆర్టీసీ ఎండీ, సీసీఎస్ పాలక మండలి చైర్మన్ ద్వారక తిరుమలరావు
● ఆర్టీసీ అభివృద్ధిలో అందరూ భాగస్వాములే ● తిరుపతిలో తొలి సీసీఎస్ రాష్ట్ర స్థాయి సర్వసభ్యసమావేశం ● ఆర్టీసీకి చెందిన పలు అంశాలపై తీర్మానం
తిరుపతి అర్బన్: ఆర్టీసీ అభివృద్ధిలో ప్రతి ఉద్యోగి భాగస్వాములు కావాలని ఆ సంస్థ ఎండీ, సీసీఎస్ పాలకవర్గ మండలి చైర్మన్ ద్వారకా తిరుమలరావు పిలుపునిచ్చారు. తిరుపతి రూరల్ ప్రాంతం, రామచంద్రాపురం మండలం, చిగురువాడ నిషాల్ కన్వెన్షన్ హాల్‌లో సీసీఎస్ (క్రెడిట్ కో–ఆపరేటివ్ సొసైటీ) మూడో సమావేశాన్ని తొలిసారిగా తిరుపతి జిల్లాలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీకి చెందిన ఉద్యోగులు హాజరయ్యారు. ముందుగా సీసీఎస్ పాలకవర్గ మండలి చైర్మన్, ఆర్టీసీ ఎండీతోపాటు సీసీఎస్ వైస్ చైర్మన్, ఈడీఏ కోటేశ్వరరావు, సెక్రటరీ దాసు, ఈడీ గోపీనాథ్‌రెడ్డి, డీపీటీఓ చెంగల్‌రెడ్డికి సీసీఎస్ సభ్యులు (డెలిగేట్స్) స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ద్వారక తిరుమలరావు మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులకు మంచిచేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని, ఉద్యోగుల సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే ప్రభుత్వంతో చర్చించి వాటికి పరిష్కారం చూపుతామని వివరించారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఎప్పుడూ అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీసీఎల్ పాలకవర్గ మండలి సభ్యులు శ్రీనివాసరాజు, అనంతరావు, వినోద్‌బాబు, గోపాల్, శేఖర్‌తోపాటు 220 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. మరోవైపు ఆర్టీసీ ఉద్యోగ సంఘం నేతలు సత్యనారాయణ, ఆవుల ప్రభాకర్‌యాదవ్, రెడ్డెప్ప, పెరుమాళ్, బీఎస్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు
ఎడ్యుకేషన్ రుణాలను రూ.5.5 లక్షల నుంచి రూ.6 లక్షలకు పెంపు
రిమూవల్ అయిన ఉద్యోగి మృతిచెందితే రుణాలను రైట్ ఆఫ్ చేయడం
అసోసియేట్ డిపాజిట్ సేకరణ బదులుగా వీఎంఆర్‌డీఎఫ్‌కి చెందిన కొత్త పథకం ద్వారా ప్రతి నెలా సేకరణ చేసి విరమణ సమయంలో డిపాజిట్ చేసేలా మార్చు