
అసెంబ్లీ సెగ్మెంట్లకు
బీజేపీ కన్వీనర్ల నియామకం
చిత్తూరు కార్పొరేషన్ : జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు కన్వీనర్లను నియమిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. చిత్తూరుకు కడియాల సురేష్, కుప్పానికి శివశంకర్, పలమనేరుకు విజయ్‌కుమార్, జీడీ నెల్లూరుకు రాజేంద్రన్, పూతలపట్టుకు కిషోర్ చౌదరి, పుంగనూరుకు మదన్‌మోహన్, నగరికి రాజశేఖర్‌రాజును నియమిస్తున్నట్లు పేర్కొన్నారు.