
ప్రజలను విచారిస్తున్న సీఐ మధుసూదన్‌రెడ్డి
చిత్తూరు అర్బన్: నగరంలోని మెసానికల్ మైదానం ప్రహరీ గోడ ఇనుప కడ్డీకి మంగళవారం ఓ గుర్తు తెలియని వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వన్‌టౌన్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి కుడిచేతికి నల్లని కాశీదారం ఉందని ఎస్‌ఐ రమేష్‌బాబు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 9440796705 నంబరుకు సమాచారం అందించాలని కోరారు.
కార్డెన్ సెర్చ్‌లో 20 వాహనాల సీజ్
పుంగనూరు : పట్టణంలోని భగత్‌సింగ్ కాలనీలో మంగళవారం వేకువజామున సీఐ మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సక్రమంగా పత్రాలు లేని 20 వాహనాలను సీజ్ చేశారు. తనిఖీల్లో ఎస్‌ఐలు మోహన్‌కుమార్, కుళ్లాయప్ప, రవికుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
సారా పట్టివేత: ఇద్దరి అరెస్ట్
చిత్తూరు అర్బన్: మండలంలోని తుమ్మింద గ్రామంలో సారా తయారు చేస్తున్న గోవిందరాజులు, కృష్ణమూర్తి అనే ఇద్దరు వ్యక్తులను మంగళవారం ఎస్‌ఈబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఊటను ధ్వంసం చేసి 40 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. దాడిలో సీఐ జోగేంద్ర, ఎస్‌ఐ బాబు పాల్గొన్నారు.

నిందితుల అరెస్ట్ చూపుతున్న సెబ్ అధికారులు
