
104 వాహనాలను ప్రారంభిస్తున్న జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
చిత్తూరు కలెక్టరేట్ : పేదల వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట వేసినట్లు జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు తెలిపారు. సోమవారం కలెక్టరేట్ వద్ద జిల్లాకు మంజూరైన నూతన 104 వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కార్యాచరణ అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. అందులో భాగంగానే ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రవేశ పెట్టారన్నారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. జేసీ వెంకటేశ్వర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 44 వాహనాల ద్వారా ప్రజలకు సత్వరమే వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మేయర్ అముద, చుడా చైర్మన్ పురుషోత్తంరెడ్డి పాల్గొన్నారు.