మార్చి 29న ఎంఐ 11 యూత్ ఎడిషన్ లాంచ్ | Xiaomi Mi 11 Youth Edition launching in China on March 29 | Sakshi
Sakshi News home page

మార్చి 29న ఎంఐ 11 యూత్ ఎడిషన్ లాంచ్

Mar 28 2021 4:23 PM | Updated on Mar 28 2021 4:40 PM

Xiaomi Mi 11 Youth Edition launching in China on March 29 - Sakshi

ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమీ సరికొత్త మొబైల్స్‌ను ఎప్పటికప్పుడూ మార్కెట్‌లోకి తీసుకొస్తుంది. తాజాగా ఎంఐ 11 యూత్ ఎడిషన్‌ను చైనాలో మార్చి 29న లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఎంఐ 11 ప్రో, ఎంఐ 11 అల్ట్రా, ఎంఐ బ్యాండ్ 6, కొత్త ఎంఐ మిక్స్ వంటి ఇతర కొత్త మొబైల్ వేరియంట్స్, పరికరాలను లాంచ్ చేయనున్నారు. ఎంఐ 11 యూత్ ఎడిషన్‌లో అమోఎల్ఈడి ప్యానెల్, ఫుల్ హెచ్‌డీ ప్లస్  రిజల్యూషన్‌తో 6.55-అంగుళాల డిస్‌ప్లే అందిస్తున్నారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90హెర్ట్జ్ కలిగి ఉంది. అదే విధంగా 20ఎంపీ సెల్ఫీ కెమెరాను షియోమీ అందిస్తుంది.

స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 780 5జీ ప్రాసెసర్ అమర్చారు. సాధారణ ఫోన్ల మాదిరిగానే ఇందులో షియోమీ ఎంఐ 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్‌ అందిస్తుంది. ఎంఐ 11 లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ ట్రఫుల్ బ్లాక్, సిట్రస్ ఎల్లో, మింట్ గ్రీన్ రంగులలో లభిస్తుందని అంచనా వేస్తున్నారు. కెమెరాల విషయానికొస్తే, స్మార్ట్‌ఫోన్ ‌లో 64 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ అల్ట్రావైడ్, 5 ఎంపీ మాక్రో కెమెరా తీసుకొనిరానున్నారు. ఈ ఫోన్‌లో 8 జీబీ ర్యామ్, 128 జీబీ అంతర్గత సామర్థ్యంతో తయారుచేశారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4,250 ఎంఏహెచ్ గా ఉంది. ఇది 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది.

చదవండి:

ఈ అమెజాన్ లింకుతో జర జాగ్రత్త!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement