విప్రోకు ఎదురుదెబ్బ: ఫ్రెషర్ల జీతం కోత అన్యాయమంటూ ఫిర్యాదు

Wipro Half package IT employee union NITES files complaint Labour Ministry - Sakshi

న్యూఢిల్లీ:  ప్రముఖ ఐటీ  సంస్థ విప్రో ఇటీవల తీసుకున్న నిర్ణయంపై ఐటీ ఉద్యోగుల సంఘం మండిపడింది. ఒక ప్రోగ్రామ్ కింద ఆన్‌బోర్డింగ్ కోసం ఎదురుచూస్తున్న ఫ్రెషర్లకు జీతాల ఆఫర్‌లను దాదాపు 50 శాతం తగ్గించే విప్రో చర్య అన్యాయం, అంగీకార యోగ్యం కాదని ఐటీ  ఉద్యోగ సంఘం  నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) పేర్కొంది.  కంపెనీ తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని డిమాండ్ చేసింది. 

కార్మిక శాఖకు ఫిర్యాదు
అంతేకాదు  ఈమేరకు ప్రోపై కార్మిక మంత్రిత్వ శాఖకు బుధవారం ఫిర్యాదు చేసింది.  విప్రో  ఫ్రెషర్ల జీతాన్ని అనైతికంగా తగ్గిస్తోంది, ఇది ఆఫర్ లెటర్ నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘన అని ఫిర్యాదు చేసింది. దీన్ని ఆమోదిస్తే ఇతర కంపెనీలు కూడా దీనిని అనుసరిస్తాయనే ఆందోళన వ్యక్తం చేసింది. ఇది  ఉద్యోగుల దోపిడీకి చఉద్యోగ భద్రత లోపానికి దారి తీస్తుందనినైట్స్‌ ఫిర్యాదులో పేర్కొంది. మరి తాజా పరిణామంపై విప్రో ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

కాగా విప్రో  రూ.  6.5 లక్షల (LPA) ఆఫర్‌తో  ఫ్రెషర్లకు  ఉద్యోగాల్లోకి  తీసుకుంది.  అయితే ప్రపంచ ఆర్థిక అనిశ్చితి,  కాస్ట్‌ కటింగ్‌ లాంటి సాకులతో  వార్షిక  వేతనం  సగానికి  కోత విధించేందుకు నిర్ణయించింది.  3.5 లక్షలకు పనిచేస్తారా అని ఈ మెయిల్‌ద్వారా వారిని కోరడం వివాదానికి తీసింది.ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తమ వ్యాపార అవసరాలకు తగినట్టుగా నియామకాల్లో సర్దుబాట్లు చేసుకుంటున్నట్టు ఆ మెయిల్‌లో విప్రో పేర్కొంది. ఈ ఆఫర్‌కు అంగీకరించి వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించింది. అయితే దీనిపై ఐటీ రంగ ఉద్యోగుల సంఘం నైట్స్ స్పందించింది. ఇది అన్యాయమని, ఆమోదించదగ్గ చర్య కాదంటూ తప్పుబట్టింది. ఆన్‌బోర్డ్ కోసం వేచి ఉన్న ఫ్రెషర్లకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేసింది. తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని, పరస్పర ప్రయోజనకరమైన పరిష్కారానికి  యూనియన్‌తో అర్థవంతమైన చర్చలు జరపాలని డిమాండ్ చేసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top