Sakshi News home page

చైనా సర్క్యూట్ బ్రేకర్ పాలసీ.. కుక్కకాటుకి చెప్పు దెబ్బగా అమెరికా రిప్లై

Published Sat, Jan 22 2022 2:42 PM

US Govt Cancelled China Flights Amid Circuit Breaker Policy - Sakshi

America Vs China Flight Fight: బయటి దేశాల పౌరులు తమ దేశంలోకి అడుగుపెట్టే విషయంపై చైనా కఠినమైన నియంత్రణల్ని అవలంభిస్తోంది. విమానాల సర్వీసుల్ని తగ్గించడంతో పాటు  ‘‘సర్క్యూట్ బ్రేకర్’’ విధానం ప్రవేశపెట్టింది. ఈ విధానం ప్రకారం.. ఎక్కువ ఇన్‌ఫెక్షన్‌ కేసులు వస్తాయని భావించే రూట్‌లో విమానాల్ని నిలిపివేస్తోంది. తద్వారా అమెరికాను టార్గెట్‌ చేయగా.. ఇప్పుడు చైనాకి కుక్కకాటుకి చెప్పు దెబ్బ పడింది.


అమెరికా నుంచి ఎక్కువ కేసులు వస్తున్నాయని ప్రకటించిన చైనా పౌర విమానయాన సంస్థ ఈ మేరకు..  అమెరికన్‌, డెల్టా, యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాల్ని రద్దు చేసింది. టేకాఫ్‌కు ముందు ఈ విమానాల్లో ప్రయాణించిన వాళ్లకు నెగెటివ్‌ ఉందని, తీరా చైనాకి చేరుకున్నాక పాజిటివ్‌ వచ్చిందని చైనా ఏవియేషన్‌ ప్రకటించడంపై దుమారం రేగింది. ఈ మేరకు కొవిడ్‌ ప్రొటోకాల్స్‌లో అమెరికన్లను చేర్చిన  నిర్ణయం వెలువడ్డాక.. అమెరికా ప్రభుత్వం నుంచి వెంటనే కౌంటర్‌ వస్తుందని అంతా భావించారు. కానీ, రోజులు గడిచినా అలా జరగలేదు.

ఈ క్రమంలో శుక్రవారం అమెరికా నుంచి బీజింగ్‌కు వెళ్లాల్సిన 44 విమానాల్ని రద్దు చేస్తున్నట్లు ఆఘమేఘాల మీద ఉత్తర్వులు జారీ చేసి ఆశ్చర్యపర్చింది. ఎయిర్‌ చైనా, చైనా ఈస్ట్రన్‌ ఎయిర్‌లైన్స్‌, చైనా సదరన్‌ ఎయిర్‌లైన్స్‌, గ్జియామెన్‌ ఎయిర్‌లైన్స్‌.. విమానాల్ని కొంతకాలం పాటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

‘‘డెల్టా, అమెరికన్, యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌ కార్యకలాపాలను దెబ్బతీసే చర్యలు ప్రజా ప్రయోజనాలకు ప్రతికూలమైనవి. అస్థిరమైన చర్యల్ని చూస్తూ ఊరుకోబోం’ అని ప్రకటనలో పేర్కొంది The US Department of Transportation. అంతేకాదు చైనీస్ రెగ్యులేషన్స్‌ పాటిస్తూ.. పాజిటివ్‌ బారిన పడ్డ US క్యారియర్‌లకు ఎలాంటి జరిమానా విధించబడదని ప్రకటిస్తూ.. చైనా ఆదేశాలకు గట్టికౌంటర్‌ ఇచ్చింది. ఈ మేరకు విమానాల నిషేధం జనవరి 30 నుంచి మార్చి 29 వరకు వర్తిస్తుందని పేర్కొంది. మరోవైపు చైనా ఏవియేషన్‌.. డిసెంబర్‌ 31 నుంచి అమెరికాకు చెందిన విమాన సర్వీసులపై నిషేధం విధించగా.. ఇప్పుడు అమెరికా కౌంటర్‌కు దిగింది.

అమెరికా తాజా చర్యపై చైనా రాయబారి ప్రతినిధి Liu Pengyu వాషింగ్టన్‌లో మాట్లాడుతూ.. అసంతృప్తి వ్యక్తం చేశారు. మిగతా దేశాలకు ఒకలా.. చైనాకు ఒకలా నిర్ణయం తీసుకోవడంపై అసహనం వ్యక్తం చేశారు. అయితే చైనా విషయంలోనే కాదు..  జర్మనీ, ఫ్రాన్స్‌ విషయంలో అమెరికా రవాణా విభాగం ఇదే పంథా పాటిస్తోందని ఎయిర్‌లైన్స్‌ ఫర్‌ అమెరికా చెబోతోంది. వింటర్‌ ఒలింపిక్స్‌ మూడు వారాల ముందుగా చోటు చేసుకున్న ఫ్లైట్‌ ఫైట్‌ పరిణామం ఆసక్తికర చర్చకు దారితీసింది. ఇదిలా ఉంటే చైనాలో కరోనా విజృంభణతో బీజింగ్‌ నుంచి వేల కొద్దీ విమానాలు రద్దైన సంగతి తెలిసిందే.

చదవండి: చైనాలో కొవిడ్‌ నిబంధనల పైశాచికం.. ఎంత దారుణమో తెలుసా?

Advertisement
Advertisement