వినియోగదారులకు శుభవార్త, అందుబాటులోకి ఆధార్‌ ఫేస్‌ అథంటికేషన్‌ యాప్‌!

Uidai Launches Aadhaar Face Authentication App And How To Use - Sakshi

బ్యాంకు అకౌంట్‌ నుంచి..సెల్‌ఫోన్‌ సిమ్‌ కొనుగోలు మొదలు..చివరకు హోటళ్ళు,సినిమా హాళ్ళలో ఆధార్‌ కార్డ్‌ తప్పని సరిగా మారింది. దేనికీ ఆధార్‌ తప్పనిసరి కాకపోయినా, ఇతర గుర్తింపుకార్డులు అనేకమున్నా, అన్నిటికీ ఆధార్‌ కావాలని పట్టుబట్టడమూ ఎక్కువైంది. ఈ నేపథ్యంలో ఆధార్‌తో పెరిగిపోతున్న సైబర్‌ నేరాల్ని అడ్డుకట్ట వేసేందుకు ఆధార్‌ సంస్థ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా ఆధార్‌ ఫేస్‌ అథంటికేషన్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించింది. 

ఇటీవల దుర్వినియోగం జరిగే ప్రమాదం ఉందన్న కారణంతో ఆధార్‌ వివరాల్ని ఎవరికి పడితే వాళ్లకు ఇవ్వకూడదంటూ ఆదార్‌ ‘భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ’ (యూఐడీఎఐ) అప్రమత్తం చేసింది. కొన్ని సంస్థలకే ఆధార్‌ వివరాలు సేకరించే లైసెన్స్‌ ఇచ్చామనీ, లైసెన్స్‌ లేని సంస్థలు ఆధార్‌ అడిగితే (ఆధార్‌ నంబర్‌లో చివరి నాలుగంకెలు మాత్రమే కనిపించే) ‘మాస్క్‌డ్‌ ఆధార్‌’ను ఇవ్వాలనీ చెప్పింది. అయితే ఈ నేపథ్యంలో యూఐడీఏఐ ఆధార్‌లో ఫేస్‌ అథంటికేషన్‌ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చినట్లు ఆధార్‌ సంస్థ ట్వీట్‌ చేసింది. 

ఆధార్‌ ఫేస్‌ ఆర్డీ యాప్‌ వినియోగం 

స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులు ముందుగా గూగుల్‌ ప్లేస్టోర్‌లోకి వెళ్లి అందులో ఆధార్‌ ఫేస్‌ ఆర్డీ యాప్‌ అని సెర్చ్‌ చేయాలి.  . 

గూగుల్‌ ప్లేస్టోర్‌లో సెర్చ్‌ చేస్తే మీకు ఆధార్‌ ఫేస్‌ ఆర్డీ యాప్‌ కనబడుతుంది. దానిపై క్లిక్‌ చేసి ఇన్‌స్టాల్‌ ఆప్షన్‌పై ట్యాప్‌ చేయాలి

మీరు ఫేస్ అథంటికేషన్ పూర్తి చేసుకోవడానికి స్క్రీన్‌పై కొన్ని నిబంధనల్ని తప్పని సరిగ్గా పాటించాల్సి ఉంటుంది. అనంతరం ప్రోసీడ్‌పై క్లిక్ చేయండి.

ఫేస్ అథంటికేషన్ సక్సెస్‌ఫుల్ అవ్వాలంటే ముందుగా మీ కెమెరా లెన్స్‌లు క్లీన్‌ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు లైటింగ్ ఉన్న చోట నిలుచోండి. అలాగే బ్యాక్‌గ్రౌండ్ కూడా క్లియర్‌గా ఉండేలా చేసుకోండి.

ఆధార్‌ అథంటికేషన్‌ ఉపయోగం ఏంటీ!
కేంద్ర ప్రభుత్వ పథకాలైన జీవన్ ప్రమాణ్, పీడీఎస్, స్కాలర్‌షిప్ స్కీమ్స్, కోవిన్, ఫార్మర్ వెల్ఫేర్ స్కీమ్స్ వంటి వాటిల్లో అప్లయ్‌ చేయాలంటే కొన్ని సార్లు ఫిజికల్‌ ఆధార్‌ కార్డ్‌ను వినియోగించాల్సి ఉంటుంది. ఇకపై అలా కాకుండా కేవలం మొబైల్‌లోని యాప్‌తో ఆధార్‌ ఫేస్‌ అథంటికేషన్‌తో పూర్తి చేసుకోవచ్చు.అంతేకాదు ఆధార కార్డు దారులు వారి వ్యక్తిగత డేటాను ఫేస్ అథంటికేషన్ కోసం సెంట్రల్ ఐడెంటిటీ డేటా రెపోజిటరీలో స్టోర్ చేసుకోవచని యూఐడీఏఐ ట్వీట్‌ చేసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top