నష్టాల్లో స్టాక్ మార్కెట్

సాక్షి, ముంబై: స్టాక్ మార్కెట్ భారీ నష్టాలతో కొనసాగుతోంది. ఆరంభ నష్టాలనుంచి మరింత నష్టపోయిన సెన్సెక్స్ 260 పాయింట్లు నష్టపోయి 38413 వద్ద, నిఫ్టీ 73 పాయింట్లు పతనమై 11249 వద్ద కొన సాగుతున్నాయి. తద్వారా నిప్టీ 11250 దిగువకు చేరింది. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టపోతుండగా, బ్యాంకింగ్, మెటల్, ఆటో షేర్లు భారీగా నష్టపోతున్నాయి. హెచడీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంకు, రిలయన్స్, ఎల్ అండ్ టీ బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్ భారీగా నష్టపోతున్నాయి. మరోవైపు అల్ట్రాటెక్ సిమెంట్ సెన్సెక్స్ లాభాల్లో టాప్ లో నిలిచింది. టైటన్, టీసీఎస్, టెక్ మహీంద్రా , ఎస్ బీఐ లాభపడుతున్నాయి.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి