షావోమి 12 ప్రొ  5జీపై భారీ తగ్గింపు,  ఎక్కడంటే!

Republic day sale massive discount on Xiaomi 12 Pro 5G - Sakshi

సాక్షి, ముంబై:  షావోమి రిపబ్లిక్‌ డే సేల్‌ భాగంగా స్మార్ట్‌టీవీలు, స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్స్‌ సహా ఇతర ఉత్పత్తులను భారీ తగ్గింపును అందిస్తోంది.  ముఖ్యంగా షావోమి 12  ప్రొ  5జీ ధరపై భారీ  డిస్కౌంట్‌ అందిస్తోంది. దీంతో పాటు  ICICI బ్యాంక్ ,ఇండస్‌ఇండ్ బ్యాంక్ వినియోగదారులు వరుసగా రూ. 3,000 , రూ. 2,000 వరకు  క్యాష్‌ బ్యాక్‌  అందిస్తోంది. ఐదు రోజుల ఈ సేల్‌లో  రోజువారీ 12 గంటల పరేడ్‌లో నిర్దిష్ట గాడ్జెట్‌లపై కస్టమర్‌లు ఈ ఆఫర్‌ల ప్రయోజనాన్ని పొందగలరు.

డీల్‌లో భాగంగా, వినియోగదారులు షావోమి 12 ప్రొ  రూ. 10,000 తగ్గింపు తరువాత రూ. 44,999కి సొంతం చేసుకోవచ్చు. మార్కెట్లో దీని అసలు    ధర రూ. 54,999 (8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్). అలాగే 12 జీబీ ర్యామ్‌, 254 జీబీ స్టోరేజ్‌ టాప్-ఎండ్ వేరియంట్‌ను భారీ తగ్గింపుతో  రూ.58,999కి కొనుగోలు చేయవచ్చు.  షావోమి అధికారిక భారతదేశ వెబ్‌సైట్‌లో  ఈసేల్‌ అందుబాటులో ఉంది.  

50 ఎంపీ ట్రిపుల్‌ రియర్‌ కెమెరాలతో వస్తున్న భారతదేశంలోని ఏకైక ఫోన్ ఇదే. ఇంకా 6.7-అంగుళాల డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 Gen 1  చిప్‌సెట్‌ షావోమి 12 ప్రొ  లోని ప్రధాన స్పెసిఫికేషన్స్‌. అలాగే 10వేల ధర ఉన్న రెడ్‌ మీ 10ను 8వేలకే లభ్యం. రూ. 4 వేల తగ్గింపుతో  షావోమి నోట్‌బుక్‌ను ఈ సేల్‌ 72999లకే కొనుగోలు చేయవచ్చు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top