మైక్రోసాఫ్ట్‌లో సమస్య: టచ్‌లో ఉన్నామంటూ మంత్రి ట్వీట్ | Microsoft Outage: Reason Identified Updates Have Been Released To Resolve The Issue, Tweeted Ashwini Vaishnaw | Sakshi
Sakshi News home page

Microsoft Global Outage: టచ్‌లో ఉన్నామంటూ మంత్రి ట్వీట్

Jul 19 2024 3:33 PM | Updated on Jul 19 2024 6:11 PM

Reason Identified Updates Released Ashwini Vaishnaw Tweet

మైక్రోసాఫ్ట్‌లో ఏర్పడ్డ సమస్య పలు రంగాల్లో తీవ్ర అంతరాయాలను కలిగిస్తోంది. వినియోగదారులకు బ్లూ స్క్రీన్‌ ఆఫ్‌ డెత్‌ ఎర్రర్‌ అనే మెసేజ్‌ వస్తోంది. ఇలా మెసేజ్ వచ్చిన తరువాత రీస్టార్ట్ అవుతున్నాయని పలువురు యూజర్లు పేర్కొంటున్నారు. సోషల్ మీడియాలో ఇదే ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. దీనిపైన కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు.

యూఎస్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌తో ప్రభుత్వం టచ్‌లో ఉందని మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్‌లో తలెత్తిన సమస్యను గుర్తించారని, దాన్ని పరిష్కరిస్తున్నారని.. ఆయన తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ట్వీట్ చేశారు.

మైక్రోసాఫ్ట్‌లో ఏర్పడ్డ సమస్య.. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ICT) వంటి వాటిని ప్రభావితం చేయదని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఇది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలకు సేవలను అందించే పాన్-ఇండియా కమ్యూనికేషన్ నెట్‌వర్క్.

మైక్రోసాఫ్ట్‌లో ఏర్పడ్డ సమస్య గురించి ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT) ఒక సాంకేతిక సలహాను జారీ చేసింది. ఇందులో క్రౌడ్ స్ట్రైక్ ఏజెంట్ ఫాల్కన్ సెన్సార్లకు సంబంధించిన విండోస్ హోస్ట్‌లు.. ఇటీవలి అప్‌డేట్‌ల కారణంగా అంతరాయాలను ఎదుర్కొంటున్నాయని, క్రాష్ అవుతున్నాయని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement