Petrol And Diesel Price: పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గిస్తూ సీఎం సంచలన నిర్ణయం

Petrol and Diesel price cut announces Maha CM Eknath Shinde - Sakshi

సాక్షి, ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సంచలన నిర్ణయం తీసుకున్నారు. పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గిస్తూ రాష్ట్ర ప్రజలకు తొలి కానుక అందించారు. పెట్రోలుపై లీటరుకు రూ. 5 డీజిల్‌పై రూ. 3 చొప్పున తగ్గించినట్లు సీఎం షిండే ప్రకటించారు.  ఫలితంగా రాష్ట్ర ఖజానాపై రూ.6,000 కోట్ల భారం పడుతుందని మంత్రివర్గ సమావేశం అనంతరం షిండే విలేకరులకు వెల్లడించారు. సామాన్య పౌరులకు మేలు జరగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

లీటర్ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 చొప్పున విలువ ఆధారిత పన్ను (వ్యాట్) తగ్గిస్తూ  తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్ర ఖజానాపై ప్రజల సంక్షేమానికి శివసేన-బీజేపీ ప్రభుత్వ నిబద్ధతలో భాగమే ఈ నిర్ణయం అని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్  ట్వీట్‌ చేశారు. మరోవైపు షిండే నిర్ణయాన్ని  అభినందిస్తూ కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి "స్వాగతించే నిర్ణయం" అని ట్వీట్‌ చేశారు. పెరుగుతున్న ధరల నుండి మన ప్రజలను రక్షించడానికి నవంబర్,మేలో కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గింపుతో పాటు మహారాష్ట్ర తాజా నిర్ణయం అక్కడి  వినియోగదారులకు పెద్ద ఉపశమనం. మిగిలిన రాష్ట్రాలు కూడా ధరల తగ్గింపుపై ఆలోచించాలని భావిస్తున్నాను అని పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top