ఒక్కరోజే డెడ్‌లైన్‌..! ఇది దాటితే కొత్త ధరలే..! షాక్‌ ఇచ్చేందుకు సిద్దమైన ఓలా..!

Ola s1 Pro to Get Costlier Old Price Till March 18 Only - Sakshi

గత ఏడాది ఓలా ఎస్‌1, ఎస్‌1ప్రో ఎలక్ట్రిక్‌ స్కూటర్లను ఓలా ఎలక్ట్రిక్‌ లాంచ్‌ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే సుమారు లక్షకుపైగా ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్ల బుకింగ్స్‌ జరిగినట్లు కంపెనీ ప్రకటించింది. తాజాగా ఓలా ఎలక్ట్రిక్‌ ఎస్‌1 ప్రో స్కూటర్‌ తదుపరి విక్రయాలు  మార్చి 17 మొదలవ్వగా మార్చి 18తో ముగియనున్నాయి. వీటి డెలివరీలు ఏప్రిల్‌లో ఉంటాయి. కాగా ఎలక్ట్రిక్‌ వాహన కొనుగోలుదారులకు షాక్‌ ఇవ్వడానికి ఓలా సిద్దమైంది.

తదుపరి అమ్మకాల్లో ఓలా ఎస్‌1 ప్రో ధరలు పెరుగుతాయని ఓలా ఎలక్ట్రిక్‌ సీఈవో భవీష్‌ అగర్వాల్‌ తెలిపారు. మార్చి 18 తరువాత జరిపే అమ్మకాల్లో ఓలా ఎస్‌1 ప్రో ధరలు పెరుగుతాయని ప్రకటించారు. అంతేకాకుండా ఆసక్తికల్గిన వారు వెంటనే బుక్‌ చేసుకోవాలని సూచించారు. ఈ విషయాన్ని భవీష్‌ అగర్వాల్‌ ట్విటర్‌లో తెలిపారు.  కాగా ప్రస్తుతం ఓలా ఎస్‌1 ప్రో ధర రూ. 1,29,999 గా ఉంది.

హోలీ నేపథ్యంలో గ్లాసీ ఫినిష్‌తో స్పెషల్‌ ఎడిషన్‌ గెరువా రంగుతో స్కూటర్‌ను ఓలా ప్రవేశపెట్టింది. మార్చి 17-18 తేదీల్లో మాత్రమే ఈ రంగు వాహనం లభిస్తుందని వివరించింది. ఎస్‌1 ప్రో ఇప్పటికే 10 రంగుల్లో లభిస్తుంది. హోలి పండుగ సందర్భంగా ఈ లిమిటెడ్‌ ఎడిషన్‌ను అందుబాటులోకి తెచ్చినట్టు ఓలా సీఈవో భవీష్‌ అగర్వాల్‌ తెలిపారు.దాంతో పాటుగా ఓలా  స్కూటర్లకు కొత్త అప్‌డేట్‌లను ప్రకటించింది. ఇది మొత్తంగా స్కూటర్ల పనితీరును మరింత మెరుగుపరుస్తుందని కంపెనీ పేర్కొంది. ఓలా ఎలక్ట్రిక్‌  స్కూటర్లకు  MoveOS 2.0 అప్‌డేట్‌తో కొత్త ఫీచర్లను జోడించింది.
 

చదవండి:  రిలయన్స్‌ వెనకడుగు..! రష్యా ముడిచమురు మాకొద్దు..! కారణం అదే..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top