బిజినెస్‌మేన్‌గా నాగచైతన్య.. బ్రాండ్‌ అంబాసిడర్‌గా రాంచరణ్‌ | Naga Chaitanya Started Food Business Ram Charan Turned As Brand Ambassador for Mango Fruity | Sakshi
Sakshi News home page

బిజినెస్‌మేన్‌గా నాగచైతన్య.. బ్రాండ్‌ అంబాసిడర్‌గా రాంచరణ్‌

Mar 5 2022 8:36 AM | Updated on Mar 5 2022 9:08 AM

Naga Chaitanya Started Food Business Ram Charan Turned As Brand Ambassador for Mango Fruity - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: నటుడు అక్కినేని నాగ చైతన్య వ్యాపారిగా మారారు. షోయు పేరుతో ఫుడ్‌ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఇందుకోసం హైదరాబాద్‌లో సెంట్రల్‌ కిచెన్‌ ఏర్పాటు చేశారు. ఆసియా రుచులను కస్టమర్లకు అందించనున్నారు. విస్తృత స్థాయిలో జపాన్‌ వంటకాలు హైదరాబాదీయులను ఊరించనున్నాయి. ఈ ఆహార పదార్థాలు స్విగ్గీలో మాత్రమే లభిస్తాయి. 

మ్యాంగో ఫ్రూటీకి అంబాసిడర్‌గా రామ్‌ చరణ్‌ 
నటి అలియా భట్‌తో కలిసి ప్రచారం
ముంబై: పార్లే ఆగ్రో ఉత్పత్తి మ్యాంగో ఫ్రూటీకి యువ నటుడు రామ్‌ చరణ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. ఇప్పటికే ఫ్రూటీకి అంబాసిడర్‌గా ఉన్న బాలీవుడ్‌ నటి అలియా భట్‌ తో కలిసి చరణ్‌ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. పార్లే ఆగ్రో ఉత్పత్తులైన యాప్పీ ఫిజ్‌కు ప్రియాంక చోప్రా, బీ ఫిజ్‌కు అర్జున్‌ కపూర్, ప్లేవర్డ్‌ మిల్క్‌ స్మూద్‌కు వరుణ్‌ దావన్‌లు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారు.  
చదవండి: ఆనంద్‌ మహీంద్రాని సాయం కోరిన టాలీవుడ్‌ క్రేజీ డైరెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement