Kia India New Logo: సరికొత్తగా కియా ఇండియా బ్రాండ్‌ | Kia India Launches New Logo, Brand Slogan | Sakshi
Sakshi News home page

Kia India New Logo: సరికొత్తగా కియా ఇండియా బ్రాండ్‌

Apr 28 2021 3:40 PM | Updated on Apr 29 2021 10:41 AM

Kia India Launches New Logo, Brand Slogan - Sakshi

దక్షిణ కొరియా ఆటోమొబైల్‌ దిగ్గజం కియా భారత్‌లో కొత్త బ్రాండింగ్‌పై దృష్టి పెట్టింది.

న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఆటోమొబైల్‌ దిగ్గజం కియా భారత్‌లో కొత్త బ్రాండింగ్‌పై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా కొత్తగా రూపొందించిన లోగో, బ్రాండ్‌ స్లోగన్‌ను ఆవిష్కరించింది. కేవలం కార్ల తయారీకే పరిమితం కాకుండా పర్యావరణ అనుకూలమైన అధునాతన వాహనాల సంస్థగా కొనుగోలుదారులకు చేరువయ్యేందుకు ఇది తోడ్పడగలదని కంపెనీ పేర్కొంది. కొత్త లోగో సెల్టోస్, సోనెట్‌ వాహనాలను మే తొలి వారంలో ఆవిష్కరించనున్నట్లు కియా ఇండియా ఎండీ కూక్యున్‌ షిమ్‌ తెలిపారు.

ప్రధాన కార్యాలయం ఉన్న దక్షిణ కొరియా వెలుపల తాము కొత్త బ్రాండింగ్‌కి మారిన తొలి దేశం భారత్‌ అని ఆయన వివరించారు. తాజా వ్యూహంలో భాగంగా తమ సేల్స్‌ నెట్‌వర్క్‌ను 218 నగరాల్లో (తృతీయ, చతుర్థ శ్రేణి పట్టణాలతో పాటు) 360 టచ్‌ పాయింట్లకు విస్తరించుకోనున్నట్లు షిమ్‌ వివరించారు. కియాకు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో 3 లక్షల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో కార్ల ప్లాంటు ఉంది.

చదవండి: 

పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement