ఐటీ కంపెనీల్లో భారీగా పెరిగిన సీఈవోల జీతాలు.. మరి ఉద్యోగుల శాలరీలో

IT Ceo Salary Increased 1,500% While Freshers Salary Up Only 50% In Last 10 Years - Sakshi

దేశీయ ఐటీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు, సీఈవో స్థాయి అధికారులకు జీతాలు భారీ ఎత్తున పెరిగాయి. గత 10 ఏళ్లలో ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి అంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

అయితే ఆయా దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల శాలరీలు అరకొర పెంచితే.. సీఈవో స్థాయి వారికి మాత్రం ఊహించని విధంగా హైక్‌ చేసినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్‌ చేస్తున్నాయి. 2012తో పోల్చితే 2022లో ఐటీ కంపెనీల్లోని ఫ్రెషర్స్‌ జీతాలు 47 శాతం మాత్రమే పెరిగాయి. సీఈవోల జీతాల్లో మాత్రం 1,492 శాతం పెరిగినట్లు తేలింది. 

ఈ సందర్భంగా ఇన్ఫోసిస్‌ మాజీ సీఎఫ్‌వో, బోర్డు సభ్యుడు టీవీ మోహన్‌దాస్ పాయ్ మాట్లాడుతూ..‘ఫ్రెషర్‌ల జీతాల్లో ఎలాంటి మార్పులు లేవు. 10 నుంచి 12 ఏళ్ల క్రితం కంపెనీలు చెల్లిస్తున్నట్లుగా  రూ.3.5 నుంచి రూ. 4 లక్షలే చెల్లిస్తున్నారు. అదే సమయంలో మేనేజర్లు, సీనియర్ల జీతం 4,5,7 రెట్లు పెరిగిందని అన్నారు.  

హెచ్‌సీఎల్ టెక్ మాజీ సీఈవో వినీత్ నాయర్ సైతం ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు. సంస్థ వృద్ధిలో ఉద్యోగుల పాత్రను గుర్తించకపోవడం నిజంగా దురదృష్టం. ఆయా కంపెనీలు మార్కెటింగ్‌, ఆఫీస్‌ నిర్వహణ కోసం చేసే ఖర్చు.. ఉద్యోగులకు శాలరీలుగా ఇస్తే.. 10 రెట్ల రాబడి పొందవచ్చనే విషయాన్ని సంస్థలు గుర్తించలేకపోతున్నాయని చెప్పారు. 

టీమ్‌ లీజ్‌ డిజిటల్‌ డేటా
టీమ్‌ లీజ్‌ డిజిటల్‌ డేటా ప్రకారం.. సీఈవోతో పాటు అదే కంపెనీలు పనిచేస్తున్న ఫ్రెషర్‌ల మధ్య వేతనాల వ్యత్యాసం భారీ స్థాయిలో ఉన్నట్లు తేలింది. ఉదాహరణకు  ఇన్ఫోసిస్‌లో ఉద్యోగులు - సీఈవోల మధ్య శాలరీ రేషియో 1973,  విప్రోలో  2,111, హెచ్‌సీఎల్‌ 1,020, టెక్ మహీంద్రాలో  644, టీసీఎస్‌లో 619గా ఉంది.  

శాలరీ వ్యత్యాసానికి కారణం!
విద్యార్ధులు గ్రాడ్యుయేట్, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ అంటూ చదువు పూర్తి చేస్తున్నారు. కానీ మార్కెట్‌లోని డిమాండ్‌కు అనుగుణంగా కావాల్సిన స్కిల్స్‌ వారిలో లేకపోవడం కారణమనే అభిప్రాయం వ్యక్తం చేశారు నాస్కామ్ మాజీ ప్రెసిడెంట్ కిరణ్ కార్నిక్. 

కార్నిక్ మాట్లాడుతూ.. నేను ఇండస్ట్రీలో వాస్తవ పరిస్థితుల గురించి మాట్లాడుతున్నాను. కంపెనీకి అవసరమైన నైపుణ్యాలు వారికి (ఫ్రెషర్స్) లేవు. డొమైన్ నైపుణ్యాలు ఉండవు. ఆ విభాగంలో శిక్షణ పొందాల్సి ఉంటుంది. ఐటీ పరిభాషలో వీటిని సాఫ్ట్‌ స్కిల్స్‌ అని అంటాం. ఆయా టీమ్స్‌లలో వర్క్‌ చేయడం, ఏ భాషలోనైనా కమ్యూనికేట్‌ చేసే టాలెంట్‌ ఉండాలని సూచించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top