ఇడ్లీదే గెలుపు, తందూరీ గట్టి ప్రయత్నం.. ఐపీఎల్‌ స్పెషల్‌ మెనూ!

IPL Special Menu Did By Harsh Goenka - Sakshi

ఇదేదో హోటల్‌, రెస్టారెంట్‌ మెనూ కాదు. ఐపీఎల్‌ స్పెషల్‌ మెనూ. ఎవరూ తయారు చేశారంటే ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్‌ హర్ష్‌ గోయెంకా. సామాజిక, సమకాలీన అంశాలపై  సోషల్‌ మీడియా వేదికగా ఆయన ‍స్పందిస్తుంటారు. ఈసారి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ టోర్నీని రెస్టారెంట్‌ మెనూతో పోల్చుతూ ఆయన ట్వీట్‌ చేశారు.  

మాజీ క్రికెటర్లు, కామెంటేటర్లు, జర్నలిస్టులు ఏదైనా బిగ్‌ టోర్నీకి ముందు డ్రీమ్‌ 11, ఆల్‌టైం గ్రేట్‌ ఇలా రకరకాల పేర్లతో టీమ్‌లను ప్రకటిస్తుంటారు. హర్ష్‌గోయెంకా కొంచెం వెరైటీగా ప్రయత్నించారు. ఐపీఎల్‌ పాయింట్ల పట్టిక ఆధారంగా టీమ్‌ పెర్ఫార్మెన్స్‌లను అంచనా వేస్తూ... ఆయా జట్లు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రాలలో ఫేమస్‌ వంటకాలతో పోల్చుతూ ఐపీఎల్‌ మెనూని తయారు చేశారు.

ఐపీఎల్‌ స్పెషల్‌ మెనూలో రసగుల్లాపై ఇడ్లీ విజయం సాధించిందంటూ ఐపీఎల్‌ ఫైనల్‌కి పోలికి పెట్టారు. తందూరీ నాన్‌ గట్టినా ప్రయత్నించినా ఫలితం లేదని బిసబెళబాత్‌ చూడటానికి బాగుంది కానీ అంటూ ఇలా ఫన్నీ పోలీకలతో ట్వీట్‌ని నడిపించారు. ఇక సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ విషయానికి వస్తే మెనూ కార్డులో బిర్యానీకి ఆఖరి స్థానం దక్కిందన్నారు హర్ష్‌ గోయెంకా.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top