AP Global Investors Summit: ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సంతోషిస్తున్నాం | Investors Tweets On Ap Global Investors Summit | Sakshi
Sakshi News home page

AP Global Investors Summit: ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సంతోషిస్తున్నాం

Mar 3 2023 9:58 PM | Updated on Mar 3 2023 10:01 PM

Investors Tweets On Ap Global Investors Summit - Sakshi

విశాఖ వేదికగా గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ ఘనంగా జరుగుతోంది. అనేక మంది దిగ్గజ పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులు ఈ సదస్సుకు తరలివచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలు, పరిశ్రమల ఏర్పాటుకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కల్పిస్తున్న స్నేహపూర్వక వాతావరణంతో అనేక కంపెనీలు వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. రిలయెన్స్‌ గ్రూపు, ఆదానీ గ్రూప్, ఆదిత్య బిర్లా గ్రూప్, రెన్యూ పవర్, అరబిందో గ్రూప్, డైకిన్, ఎన్టీపీసీ, ఐఓసీఎల్, జిందాల్‌ గ్రూప్, మోండలీస్, పార్లీ, శ్రీ సిమెంట్స్‌ వంటి కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయడంతో పాటు మరికొన్ని తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి

రాష్ట్రంలో జరుగుతున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో పాల్గొన్న పలువురు పారిశ్రామిక వేత్తలు సదస్సును ప్రశంసిస్తూ ట్వీట్లు చేశారు. ఏపీ ప్రభుత్వంతో తాము ఎంఓయూలు కుదుర్చుకున్న విషయాన్ని తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సంతోషిస్తున్నామంటూ ట్విటర్‌ ద్వారా తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement