పవర్ బ్యాంక్ కొనే ముందు ఇవి తప్పక తెలుసుకోండి!

How do I know a good power bank  - Sakshi

ఈ రోజు చాలా వరకు స్మార్ట్‌ఫోన్‌లు పెద్ద బ్యాటరీ సామర్థ్యాలను కలిగి ఉంటున్నాయి. కానీ, ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో మన బ్యాటరీ తొందరగా ఖాళీ అయిపోతుంది. ముఖ్యంగా జర్నీ చేసేవాళ్లను ఎక్కువగా వేదించే సమస్య బ్యాటరీ. అందుకే వారు తమ వేంట తప్పనిసరిగా పవర్ బ్యాంక్ తీసుకెళ్తుంటారు. మనం పవర్ బ్యాంక్ కొనే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తు పెట్టుకోవాలి.

  • చాలా వరకు పవర్ బ్యాంక్ కంపెనీలు భారీ సామర్ధ్యం ఉన్నా పవర్ బ్యాంక్ లు కొనుగోలు చేయమని సలహాలు ఇస్తుంటాయి. అయితే, మనం వారి మార్కెట్ బుట్టలో పడవద్దు. మన వాడే మొబైలును బట్టి పవర్ బ్యాంక్ ను కొనుగోలు చేయాలి. ఉదా: ఫోన్ యొక్క బ్యాటరీ సామర్ధ్యం అనేది 4000 ఎంఏహెచ్ అనుకుంటే 10,000 ఎంఏహెచ్ సామర్ధ్యం గల పవర్ బ్యాంక్ తీసుకుంటే సరిపోతుంది. 
  • 10,000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ అయినా మీకు ఔట్‌పుట్ వచ్చేది సుమారు 8,000 ఎంఏహెచ్ మాత్రమే. 20 శాతం వరకు ఔట్‌పుట్ తక్కువగా వస్తుందన్న సంగతి గుర్తుంచుకోండి.
  • మీరు అధిక సామర్థ్యం గల పవర్ బ్యాంకుల తీసుకునేటప్పుడు కొలతలు, బరువు, ఆకారం వంటి లక్షణాలను పరిగణలోకి తీసుకోవాలి.
  • పవర్ బ్యాంక్ కొనేముందు ఎంత ఫాస్ట్‌గా ఛార్జ్ అవుతుందో చూడాలి. అంతేకాదు పవర్ బ్యాంక్ నుంచి స్మార్ట్‌ఫోన్‌కు ఎంత ఫాస్ట్‌గా స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ అవుతుందో కూడా చెక్ చేయాలి. సర్క్యుట్ ప్రొటెక్షన్ కూడా ఉండేలా చూసుకోవడం మంచిది.
  • ఫాస్ట్ ఛార్జింగ్ చేసే అడాప్టర్ ఉపయోగిస్తే పవర్ బ్యాంక్ త్వరగా ఫుల్ అవుతుంది. మీరు ఫోన్ కొన్నప్పుడు వచ్చిన ఫాస్ట్ ఛార్జర్‌తో పవర్ బ్యాంక్ ఛార్జ్ చేయొచ్చు. పవర్ బ్యాంక్ రోజూ ఉపయోగించాల్సిన అవసరం లేదు. మీకు ఎలక్ట్రిసిటీ అందుబాటులో ఉన్నప్పుడు నేరుగా మీ స్మార్ట్‌ఫోన్ ఛార్జ్ చేయడం మంచిది.
  • ఎల్ఈడీ ఇండికేటర్ లేదా డిజిటల్ డిస్‌ప్లే ఉన్న పవర్ బ్యాంక్ తీసుకోవాలి. దీని వల్ల పవర్ బ్యాంక్ ఫుల్ ఉందా? ఎంత శాతం ఛార్జింగ్ అయిపోయింది? అన్న వివరాలు తెలుస్తాయి. 
  • పవర్ బ్యాంకులో నాలుగు ఎల్ఈడీ లైట్స్ ఉంటాయి. ఒకే ఎల్ఈడీ లైట్ వెలుగుతుందంటే పవర్ బ్యాంక్ దాదాపుగా ఖాళీ అయినట్టే. పూర్తిగా ఖాళీ కాకముందే పవర్ బ్యాంక్ ఛార్జ్ చేయాలి. అన్ని ఎల్ఈడీలు వెలుగుతున్నాయంటే పవర్ బ్యాంక్ ఫుల్ ఛార్జ్ అయినట్టే.
  • మనం పవర్ బ్యాంక్ లను కొనే ముందు బ్రాండెడ్ గల కంపెనీలను ఎంచుకుంటే మంచిది. ఎందుకంటే అవి ఛార్జ్ సమయం, బ్యాటరీ మన్నిక, ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్, ఛార్జింగ్ స్పీడ్, బిల్డ్ క్వాలిటీ వంటి విషయాలలో కొంచెం నాణ్యతను పాటిస్తాయి. నకిలీ కంపెనీల నుండి అసలు తీసుకోకుంటే మంచిది.
  • ఛార్జింగ్ సదుపాయం లేనప్పుడే పవర్ బ్యాంక్ ఉపయోగించాలి. ఓ పవర్ బ్యాంకును రెగ్యులర్‌గా కాకుండా అప్పుడప్పుడు ఉపయోగిస్తే 18 నెలల నుంచి 24 నెలల జీవితం ఉంటుంది. రెగ్యులర్‌గా వాడితే మాత్రం ఏడాదికో పవర్ బ్యాంక్ మార్చాల్సిందే.

చదవండి:

ఇండియా కా నయా బ్లాక్‌బస్టర్‌ వచ్చేసింది 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top