ఫ్లాగ్‌స్టార్‌ చేతికి సిగ్నేచర్‌ బ్యాంక్‌ డీల్‌ విలువ రూ. 22,300 కోట్లు 

Flagstar Bank bought most of Signature Banks deposits - Sakshi

న్యూయార్క్‌: గత వారం మూతపడిన సిగ్నేచర్‌ బ్యాంకు మెజారిటీ ఆస్తుల కొనుగోలుకి న్యూయార్క్‌ కమ్యూనిటీ బ్యాంక్‌ అంగీకరించింది. డీల్‌ విలువ 2.7 బిలియన్‌ డాలర్లు (రూ. 22,300 కోట్లు)గా ఫెడరల్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ కార్ప్‌ (ఎఫ్‌డీఐసీ) వెల్లడించింది.

ఇదీ  చదవండి:  రెండు నెలల్లో 6 ఐపివోలకు చెక్: లిస్ట్‌లో ఓయో, షాక్‌లో పేటీఎమ్

ఒప్పందంలో భాగంగా అనుబంధ సంస్థలలో ఒకటైన ఫ్లాగ్‌స్టార్‌ బ్యాంక్‌ ద్వారా సిగ్నేచర్‌ బ్యాంకుకు చెందిన 38.4 బిలియన్‌ డాలర్ల ఆస్తులను న్యూయార్క్‌ కమ్యూనిటీ కొనుగోలు చేయనుంది. ఇవి సిగ్నేచర్‌ ఆస్తులలో ముప్పావు వంతుకాగా.. సోమవారం(20) నుంచి  సిగ్నేచర్‌కు చెందిన 40 బ్రాంచీలు ఫ్లాగ్‌స్టార్‌ నిర్వహణలోకి వస్తాయి. సిగ్నేచర్‌కు చెందిన 60 బిలియన్‌ డాలర్ల రుణాలు రిసీవర్‌షిప్‌ (కస్టోడియన్‌) కింద ఉన్నట్లు ఎఫ్‌డీఐసీ పేర్కొంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top