చారిత్రక ఘట్టం: పంది గుండె మనిషికి దానం.. పేషెంట్‌ కోలుకుంటే గనుక అద్భుతమే!

First In History US Surgeons Successfully Implant pig Heart In Human - Sakshi

Pig Heart Transplantation To Human: వైద్య శాస్త్రంలో మరో  చారిత్రక ఘట్టం చోటు చేసుకుంది.  మనిషికి పంది గుండెను విజయవంతంగా అమర్చారు అమెరికన్‌ వైద్యులు. తద్వారా అవయవాల కొరత, అవి దొరక్క చనిపోతున్న వేల మందికి ప్రాణదానం చేసే అవకాశం లభించినట్లయ్యింది. 

శుక్రవారం బాల్టిమోర్‌ ‘మేరీలాండ్‌ మెడికల్‌ స్కూల్‌ ఆస్పత్రిలో ఈ అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. పంది నుంచి తీసిన గుండెను మనిషికి అమర్చారు. ఆపరేషన్‌ విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు వైద్యులు. జన్యుపరంగా మార్పు చేయబడిన పంది గుండెను అమర్చడం ద్వారా పేషెంట్‌కు ప్రాణదానం చేసినట్లయ్యింది. 

57 ఏళ్ల డేవిడ్‌ బెన్నెట్‌ అనే వ్యక్తికి ఈ సర్జరీ జరిగింది.  సంప్రదాయ మార్పిడికి పేషెంట్‌ పరిస్థితి అనుకూలించని తరుణంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు వైద్యులు.  ఇందుకోసం అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్ అత్యవసర అనుమతులు జారీ చేసింది. ప్రస్తుతం డేవిడ్‌ కోలుకుంటున్నాడని, ఇంకొన్నాళ్లు అబ్జర్వేషన్‌లో ఉంచాలని చెప్తున్నారు. పేషెంట్‌ గనుక పూర్తిగా కొలుకుంటే గనుక అద్భుతమే అవుతుంది.

వైద్య శాస్త్రంలో ఇదొక చారిత్రక ఘట్టమని చెబుతున్నారు వైద్యులు. తద్వారా భవిష్యత్తులో ఆర్గాన్‌ డొనేషన్స్‌ కొరతను పరిష్కరించడానికి ఒక మార్గం దొరికినట్లు అయ్యింది. ఇదిలా ఉంటే బ్రెయిన్ డెడ్ అయి కృత్రిమ లైఫ్ సపోర్ట్‌పై కోలుకోలేని స్థితిలో ఉన్న వ్యక్తికి పంది కిడ్నీని అమర్చిన సంగతి తెలిసిందే. కిందటి ఏడాది అక్టోబర్‌లో న్యూయార్క్‌ యూనివర్సిటీ లాన్‌గోన్ హెల్త్ మెడికల్ సెంటర్‌లో వైద్యులు ఈ ఆపరేషన్ చేయగా.. పేషెంట్‌ ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు. 

వేలల్లో మరణాలు
అమెరికాలో ప్రతీ ఏడాది సగటున ఆరు వేల మందికి పైగా పేషెంట్లు.. గుండె మార్పిడికి ముందే చనిపోతున్నారు. అవయవాల కొరతే అందుకు ప్రధాన కారణం.  ప్రస్తుతం అమెరికాలో లక్షా పదివేల మందికి పైగా గుండె మార్పిడి ఆపరేషన్ల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. 

1984లో బబూన్‌(కోతి జాతికి చెందినది) గుండెను ఓ నవజాత శిశువుకు అమర్చగా.. సర్జరీ విజయవంతం అయినప్పటికీ ఆ పసికందు మాత్రం 20 రోజులే జీవించగలిగింది. అయితే ఇప్పుడా పరిస్థితి మారింది. ఇక పంది శరీరాకృతి, ఎదుగుదల, పైగా మాంసం తింటారు కాబట్టి ఆధారంగా.. అవయవాలు తీసుకోవడానికి ఉత్తమమైందని అమెరికన్‌ డాక్టర్లు భావిస్తున్నారు.

సంబంధిత వార్త: పేషెంట్‌కు పంది కిడ్నీ అమర్చారు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top