అదిరిపోయిన లండన్ ఎలక్ట్రిక్ స్కూటర్.. హైదరాబాద్‌‌‌‌లో హెడ్ ఆఫీస్!

The First Ever British Brand of Elegant EVs in India - Sakshi

దేశంలో రోజు రోజుకి ఎలక్ట్రిక్ వాహన అమ్మకాలు పుంజుకుంటున్న నేపథ్యంలో అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు సిద్దం అవుతున్నాయి. ఇప్పటికే అనేక దిగ్గజ కంపెనీలు ఇండియాలో తమ ఎలక్ట్రిక్ వాహనలను లాంచ్ కార్యాచరణను ప్రకటించాయి. ఇప్పుడు బ్రిటిష్‌కి చెందిన వన్ మోటో కంపెనీ భారతదేశంలో తమ స్కూటర్ లాంచ్ చేసేందుకు సిద్దం అయినట్లు ప్రకటించింది. వన్ మోటో ఇండియా అధికారికంగా హైదరాబాద్‌‌‌‌లో తమ భారతీయ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే, ముంబైలో ఒక బ్రాంచీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.

ప్రపంచంలో అత్యంత ప్రభావశీల కంపెనీలలో ఇది ఒకటి. వన్ మోటో ఇండియా వచ్చే ఏడాది నుంచి భారత్ దేశంలో 3 మోడల్స్(Commuta, Electa, Byka) విడుదల చేయనున్నట్లు తెలిపింది. కమ్యుటా అనేది 75 కిలోమీటర్ల శ్రేణి గల ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ స్కూటర్. రూ.120,000 బేస్ ధరతో కమ్యుటా భారత మార్కెట్లోకి ప్రవేశించనుంది. అయితే బైకా, ఎలెక్టాలు 4000కెడబ్ల్యు గల శక్తివంతమైన బాష్ మోటార్ సహాయంతో 150 కిలోమీటర్ల శ్రేణి అందించే స్కూటర్లు. ఈ బైకా, ఎలెక్టా స్కూటర్ల ప్రారంభ ధర రూ.1,85,000గా ఉండనుంది. ఇండియన్ స్టార్టప్ ఎలైసియం ఆటోమోటివ్స్ భారతదేశంలో వన్ మోటోను లాంఛ్ చేస్తోంది.
 

(చదవండి: ఈ ఫోన్‌ దూకుడు మామూలుగా లేదుగా, అదిరిపోయే ఫీచర్లతో)

ఇప్పటికే చాలా అవార్డులు గెలుచుకున్న బ్రిటిష్ ఎలక్ట్రిక్ వాహన కంపెనీ ఇప్పటికే యూరప్ మార్కెట్లలో తన సత్తా చాటింది. ఇప్పుడు వన్ మోటో భారతదేశంపై దృష్టి పెట్టింది. 2022 జనవరిలో ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. వన్ మోటో బైకా, ఎలెక్టా స్కూటర్లు రెండు కూడా 3.3 సెకన్లలో 0-50 కిమీ వేగాన్ని అందుకోగలవు. వీటి టాప్ స్పీడ్ వచ్చేసి 85 కిమీగా ఉంది. ఈ రెండు స్కూటర్లను ఒకసారి ఛార్జ్ చేస్తే 150 కి.మీ వెళ్లగలవు. దీనిని ఛార్జింగ్ చేయడానికి 4 గంటల సమయం పట్టనుంది. ఈ స్కూటర్ మార్కెట్లో ఉన్న ఓలా, ఏథర్ స్కూటర్లకు గట్టి పోటీని ఇవ్వనుంది. ఈ స్కూటర్ చూడాటానికి అచ్చం బజాజ్ చేతక్ మోడల్ ని పోలి ఉంటుంది.

(చదవండి: జోరందుకున్న హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top