Elon Musk: ఎలన్‌ మస్క్‌కి ఏమైంది, ఎందుకిలా?.. | Elon musk again sold tesla stock worth billion worth | Sakshi
Sakshi News home page

రికార్డు ఫీట్‌! ఒక్కవారంలో 7 బిలియన్‌ డాలర్ల షేర్ల అమ్మకం.. మస్క్‌ చర్యలు ఊహాతీతం

Nov 13 2021 11:26 AM | Updated on Nov 13 2021 3:11 PM

Elon musk again sold tesla stock worth billion worth - Sakshi

ఆయన చేష్టలు ఇప్పుడు నిజంగానే ఊహాతీతం అనిపిస్తున్నాయి. సీఈవో పొజిషన్‌లో ఉండి.. షేర్లు అమ్మేసుకోవడం టెస్లాకు మింగుడు పడనివ్వడం లేదు.

Elon Musk Did It Again.. Sells tesla Shares: టెస్లా సీఈవో ఎలన్‌ మస్క్‌కి ఏమైందసలు?.. ఈ ప్రశ్న మీద ఆర్థిక, షేర్‌ మార్కెట్‌ నిపుణులు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. 


ప్రపంచంలోనే అత్యధిక ధనికుడైన ఎలన్‌ మస్క్‌.. ఈ ఒక్క వారంలోనే టెస్లాలో తన పేరిట ఉన్న 6.9 బిలియన్‌ డాలర్ల విలువైన షేర్లను అమ్మేసుకున్నాడు. 

సీఈవో హోదాలో ఓ వ్యక్తి ఈ స్థాయిలో వాటాలు అమ్మేసుకోవడం ఇదే ఫస్ట్ టైం. 
   
తాజాగా.. శుక్రవారం 1.2 మిలియన్‌ షేర్లను అమ్మేశారు. వీటి విలువ 1.2 బిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువేనని తెలుస్తోంది.

టెస్లాలో తన వాటాలోని షేర్లలో 10 శాతం(17 మిలియన్‌ షేర్లు) అమ్మకానికి ఉంచాలనుకుంటున్నట్లు గత శనివారం ఆయన ట్వీట్‌ పోల్‌ ద్వారా ఫాలోవర్స్‌ ఒపినీయన్‌ కోరారు. 

అందుకు చాలామంది సమ్మతి తెలుపగా..  ఇప్పటివరకు 6.36 మిలియన్‌ షేర్లు (37 శాతం) దాకా అమ్మేశాడు. సో.. మరో పది మిలియన్‌ షేర్లు అమ్మేస్తే ఆయన అనుకున్నది పూర్తవుతుంది.

ఇక ఎలన్‌ మస్క్‌ చేష్టలు మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపెడుతున్నాయి. శుక్రవారం మార్కెట్‌ ముగిసే సమయానికి 2.8 శాతం పడిపోయిన టెస్లా షేర్లు, 1,033.42 డాలర్‌ వద్ద ముగిసింది. అయితే ఈ పరిణామాలేవీ ‘ఆటోమేకర్‌ కింగ్‌’ అయిన టెస్లా మార్కెట్‌ను అంత ఈజీగా దెబ్బతీసేలా కనిపించడం లేదు. పైపెచ్చు ఈవీ అమ్మకాల జోరు స్పష్టంగా కనిపిస్తోంది. 

ట్రెండ్‌ స్పైడర్‌ ప్రకారం..

ఈ అమ్మకానికి ముందు స్టాక్‌ ఆప్షన్స్‌తో కలిపి సుమారు 23 శాతం స్టాక్‌ వాటా టెస్లాలో ఉంది ఎలన్‌ మస్క్‌కి. అయితే సరైన కారణాలు చెప్పకుండా ఆయన చేస్తున్న పని మార్కెట్‌ను మాత్రం కుదేలు చేస్తోంది.

చదవండి: Elon Musk Shares.. కారణం ఇదేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement