Details About Inflatable e bike Poimo - Sakshi
Sakshi News home page

Poimo E Bike: భలే స్కూటర్‌.. మడత పెట్టి బ్యాగులో పెట్టేయోచ్చు!

Dec 28 2021 10:53 AM | Updated on Dec 28 2021 12:32 PM

Details About Inflatable e bike Poimo - Sakshi

కొంగొత్త ఆవిష్కరణలకు ఎప్పుడు ముందుండే జపాన్‌ శాస్త్రవేత్తలు మరోసారి అబ్బురపరిచే ఆవిష్కరణకు తెర లేపారు. ఇప్పటి వరకు ఎవరూ కనీ వినీ ఎరుగని కాన్సెప్టుతో ఈ బైకును రెడీ చేశారు.

ఈ స్కూటర్ల హవా
వందేళ్ల కిందట ప్రధాన ఇంధనం అంటే బొగ్గు మాత్రమే. ఆ తర్వాత పెట్రోలు డీజిల్‌లు ఆ స్థానాన్ని ఆక్రమించాయి. కానీ కాలుష్యానికి కారణమవుత్ను బొగ్గు, పెట్రోల వాడకాన్ని ప్రపంచ వ్యాప్తంగా తగ్గించాలని నిర్ణయించారు. ప్రత్యామ్నాయంగా సోలార్‌, హైడ్రోజన్‌, ఎలక్ట్రిక్‌ ఎనర్జీ వైపు చూస్తున్నారు. ఆ కోవలో ఈ బైకులు ఇబ్బడిముబ్బడిగా మార్కెట్‌లోకి వస్తున్నాయి. కానీ జపాన్‌ శాస్త్రవేత్తలు రూపొందించిన కొత్త రకం బైకు మాత్రం అందరి చేత ఔరా అనిపిస్తోంది. 

టోక్యో యూనివర్సిటీలో
జపాన్‌లో యూనివర్సిటీ ఆఫ్‌ టోక్యోకి చెందిన శాస్త్రవేత్తలు ఇన్‌ఫ్లాటబుల్‌ స్కూటర్‌ కాన్సెప్టుతో కొత్త రకం రవాణా సాధానం అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రోటోటైప్‌ వెహికల్‌కి పోమో అని పేరు పెట్టారు. దీని ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి.

ఫీచర్లు
- సాధారణ బైకుల తయారీలో ఉపయోగించే మెటల్స్‌ కాకుండా థెర్మోప్లాస్టిక్‌ పాలీథరిన్‌ రబ్బర్‌తో బైకు బాడీని తయారు చేశారు. ఫలితంగా బాడీ తక్కువ బరువుతో పాటు మడత పెట్టేందుకు వీలుగా ఉంటుంది.
- గాలి మిషన్‌తో పంపు కొడితే రెండుమూడు నిమిషాల్లో బైకు బాడీ రెడీ అవుతుంది.
- ఈ బైకు ముందు, వెనకాల భాగంలో రెండు జతల వంతున ఫోర్‌వీల్స్‌ ఉంటాయి. ఇందులోనే మోటార్‌ కమ్‌ బ్యాటరీ ఉంటుంది. హ్యాండిల్‌ బార్‌ దగ్గర కంట్రోల్స్‌ ఉంటాయి.
- కష్టమర్ల అవసరాలకు తగ్గట్టు ఈ బైకును విభిన్న డిజైన్లలో తయారు చేసే వీలుంది
- ఈ బైకు బరువు గరిష్టంగా 5.5 కేజీలు ఉంటుంది. బైకును మడత పెట్టి బ్యాక్‌ప్యాక్‌లో పెట్టుకుని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు.
- ఒక్కసారి బ్యాటరినీ ఛార్జ్‌ చేస్తే 90 నిమిషాల పాటు నడుస్తుంది. గరిష్ట వేగం గంటికి 15 కి.మీ. సింగిల్‌ ఛార్జ్‌తో సుమారు 20 కి.మీ ప్రయాణం చేయగలదు.
- పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు, పర్సనల్‌ ట్రాన్స్‌పోర్టు స్థాయిలో సేవలు అందివ్వలేకపోయినా లాస్ట్‌మైల్‌ అవసరాలు తీర్చగలదు. అంటే రైల్వే స్టేషన్‌ నుంచి ఆఫీస్‌ వరకు, గ్రామాల్లో రోడ్‌ పాయింట్‌ నుంచి ఇంటి వరకు, ఇంటి దగ్గరి నుంచి ఫార్మ్‌ వరకు ఇలా ప్రధాన రవాణా సౌకర్యాలు అందుబాటులో లేని చోట పోమో బైకు ఎంతగానో ఉపకరిస్తుందని జపాన్‌ శాస్త్రవేత్తలు హామీ ఇస్తున్నారు.
- ఏడాది కిందట ఈ పోమోబైకు ప్రోటోటైప్‌కి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. అయితే ఈ పోమో ఈబైకును ఎప్పుడు మార్కెట్‌లోకి రావచ్చు. పూర్తి స్థాయి ఫీచర్లపై టోక్యో యూనివర్సిటీ నుంచి ప్రకటన రావాల్సి ఉంది.

చదవండి: గప్‌‘చిప్‌’గా చెప్పేస్తుంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement