
నెలకు రూ.299తో ఫైబర్ ప్లాన్స్
రామగిరి (నల్లగొండ): బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి ఇంటర్నెట్, టీవీ వినియోగదారులకు అతి తక్కువ ధరలో ఆకర్షణీయమైన ఫైబర్ ప్లాన్స్ విడుదల చేసినట్లు ఉమ్మడి జిల్లా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పి. వెంకటేశం సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డిజిటల్ భారత్‌లో భాగంగా వినియోగదారులకు ఇంటర్నెట్, టీవీ ఛానెళ్లు, ల్యాండ్‌లైన్ ఫోన్ కనెక్షన్‌ను కేవలం నెలకు రూ.299కి అందించనున్నట్లు తెలిపారు.
దీంట్లో 460 టీవీ ఛానెళ్లు, 20 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ 500జీబీ డేటా, ఉచిత అన్‌లిమిలెడ్ కాల్స్ కూడా ఉంటాయని పేర్కొన్నారు. 6 నెలలు, వార్షిక ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయని.. మరిన్ని వివరాలకు బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్ నంబర్ 18004444ను సంప్రదించవచ్చని సూచించారు.