కొత్త కారు కొనేవారికి షాక్ ఇచ్చిన బీఎండబ్ల్యూ..!

BMW India To Hike Prices Across Entire Range From April 1 - Sakshi

కొత్తగా కారు కొనాలనుకునే వారికి లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ఇండియా షాక్ ఇచ్చింది. ఏప్రిల్ 1 నుంచి తన మొత్తం మోడల్ శ్రేణి కారు ధరలను 3.5 శాతం వరకు పెంచనున్నట్లు శుక్రవారం తెలిపింది. మెటీరియల్, లాజిస్టిక్స్ ఖర్చులు, ప్రస్తుత భౌగోళిక-రాజకీయ పరిస్థితుల ప్రభావం, మారకం రేట్ల ప్రభావం వల్ల ధరలను పెంచాల్సి వచ్చినట్లు జర్మన్ ఆటోమేకర్ ఒక ప్రకటనలో తెలిపింది. 

2 సిరీస్ గ్రాన్ కూపే, 3 సిరీస్, 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్, ఎమ్ 340ఐ, 5 సిరీస్, 6 సిరీస్ గ్రాన్ టురిస్మో, 7 సిరీస్, ఎక్స్1, ఎక్స్ 3, ఎక్స్ 4, ఎక్స్ 5, ఎక్స్ 7, మినీ కంట్రీమ్యాన్ కార్లతో సహా స్థానికంగా ఉత్పత్తి చేసిన కార్లను కంపెనీ విక్రయిస్తుంది. బీఎండబ్ల్యూ డీలర్ షిప్ కేంద్రాలలో 8 సీరిస్ గ్రాన్ కూపే, ఎక్స్ 6, జెడ్4, ఎమ్2 కాంపిటీషన్, ఎమ్5 కాంపిటీషన్, ఎమ్8 కూపే,ఎక్స్ 3ఎమ్, ఎక్స్ 5ఎమ్ కార్లను కూడా అమ్మకాలు జరుపుతుంది. బీఎండబ్ల్యూ గ్రూప్'కు 100 శాతం సబ్సిడరీ అయిన బీఎండబ్ల్యూ ఇండియా ప్రధాన కార్యాలయం గురుగ్రామ్'లో ఉంది.

(చదవండి: ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్.. రూ.30 వేల యాపిల్ ఐఫోన్ రూ.15 వేలకే..!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top