అమెజాన్‌ రిపబ్లిక్‌ డే సేల్‌: స్మార్ట్‌ఫోన్స్‌, ల్యాప్‌టాప్స్‌పై బ్లాక్‌బస్టర్ డీల్స్

Amazon Great Republic Day Sale Check Dates and deals here - Sakshi

సాక్షి,ముంబై:  ఇ-కామర్స్ మేజర్ అమెజాన్ ఇండియా రిపబ్లిక్ డే సేల్ 2023 తేదీలను ప్రకటించింది. 2023 సంవత్సరానికి అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా  జనవరి 19 నుండి జనవరి 22 వరకు  తగ్గింపు ధరల్లో పలు ఉత్పత్తులను అందించనుంది. ముఖ్యంగా  స్మార్ట్‌ఫోన్స్‌పై 40 శాతం వరకు తగ్గింపును, ల్యాప్‌టాప్‌లు , స్మార్ట్‌వాచ్‌లపై 75 శాతం తగ్గింపును అందిస్తుంది.

అలాగే ఎప్పటిలాగానే  అమెజాన్ ప్రైమ్ మెంబర్‌లు జనవరి 18 నుండే ఈ సేల్‌లో కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు ఈ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో బ్లాక్‌బస్టర్ డీల్స్, బడ్జెట్ బజార్, ప్రీ-బుకింగ్, రాత్రి 8 గంటల డీల్స్‌తో పాటు కొత్త లాంచ్‌లు కూడా ఉంటాయని అమెజాన్ ఇండియా వెల్లడించింది.

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2023 సందర్భంగా ఆపిల్‌, శాంసంగ్‌, వన్‌ప్లస్‌, వివో, రియల్‌మీ, ఒప్పో, షావోమీ లాంటి బ్రాండ్‌ల బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లపై అద్భుతమైన డీల్స్‌ను సొంతం చేసుకోవచ్చు.  దీంతోపాటు  ఎలక్ట్రానిక్స్, దుస్తులు తదితరాలపై కూడా తగ్గింపు ఉంటుంది.  ప్రస్తుతం ప్రైమ్ ఫోన్ పార్టీ" సేల్  నడుస్తోంది. 

బ్యాంకు కార్డ్ వినియోగదారులకు ఆఫర్లు 
ఎస్‌బీఐ  కార్డ్  యూజర్ల  EMI లావాదేవీలపై 10 శాతం తక్షణ తగ్గింపును ఆఫర్ చేస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ  కార్డ్ లావాదేవీలపై 10 శాతం  (రూ. 1,000 వరకు) తక్షణ క్యాష్‌బ్యాక్‌ను అందించనుంది.

మరిన్ని వార్తలు :

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top