సన్నాల సాగు.. బాగు | - | Sakshi
Sakshi News home page

సన్నాల సాగు.. బాగు

Jun 18 2026 12:11 AM | Updated on Jun 18 2026 12:11 AM

● వినియోగంతో పాటే పెరుగుతున్న డిమాండ్‌ ● మద్దతు ధర, బోనస్‌తో రైతులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం ● ప్రభుత్వ సంస్థల ద్వారా విత్తన విక్రయాలు

● వినియోగంతో పాటే పెరుగుతున్న డిమాండ్‌ ● మద్దతు ధర, బోనస్‌తో రైతులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం ● ప్రభుత్వ సంస్థల ద్వారా విత్తన విక్రయాలు

ఖమ్మంవ్యవసాయం: వరిలో సన్న రకాలకు మంచి డిమాండ్‌ ఉంది. స్థానికంగానే కాక జాతీయంగా, అంతర్జాతీయంగా కూడా ఈ రకాల వినియోగం గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యాన ప్రభుత్వం కూడా రేషన్‌ షాపుల ద్వారా సన్న బియ్యం సరఫరా చేస్తూ ఈ రకాల ధాన్యం సాగుకు రైతులను ప్రోత్సహిస్తోంది. అలాగే, రైతులకు మద్దతు ధరతో పాటు క్వింటాకు రూ.500 బోనస్‌ చెల్లిస్తున్నారు. ఈమేరకు అన్నదాతలు సన్నాలు సాగు చేసి లాభాలు పొందాలని వైరా కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) శాస్త్రవేత్త డాక్టర్‌ చైతన్య సూచిస్తున్నారు. కాగా, కేవీకే ద్వారా బీపీటీ–5204, డబ్ల్యూజీఎల్‌–44, డబ్ల్యూజీఎల్‌–962 రకాలు విక్రయానికి అందుబాటులో ఉన్నాయి. అంతేకాక తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ కూడా పలు రకాల వరి విత్తనాలను అందుబాటులోకి తీసుకొస్తోంది.

రకాల వారీగా వివరాలు..

నేలల రకాలు, వనరుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది రకాల సన్న వరి వంగడాలను ఎంపిక చేసింది. ఇందులో ఆరు వరి వంగడాలు రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందినవి. ఆయా విత్తనాల వివరాలిలా ఉన్నాయి.

ఆర్‌ఎన్‌ఆర్‌–15048: ఈ రకం పంట కాలం వానాకాలంలోనైతే 125 రోజులు, యాసంగిలో 135 రోజులుగా ఉంది. ఎకరాకు 26 – 28 క్వింటాళ్ల దిగబడి వస్తుంది. అగ్గి తెగులను తట్టుకుంటుంది. మొగి పురుగు ఎక్కువగా ఆశిస్తుంది.

జేజీఎల్‌–1798: ఈ రకం పంట కాలం వానాకాలంలో 125 రోజులు, యాసంగిలో 140 రోజులుగా నమోదైంది. ఇది కూడా ఎకరాకు 26 – 28 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. ఉల్లికోడును పూర్తిగా తట్టుకుంటుంది. అంతేకాక అగ్గి తెగులు, పాము పొడ తెగులును కొంతమేర తట్టుకుంటుంది.

కేఎన్‌ఎం–1638: ఈ రకం పంట కాలం వానాకాలంలో 125, యాసంగిలో 135 రోజులుగా ఉంటుంది. ఇది ఎకరాకు 30 – 34 క్వింటాళ్ల దిగబడి ఇస్తుంది. ఉల్లికోడును తట్టుకునే ఈ రకానికి ఉంటుంది.

డబ్ల్యూజీఎల్‌–962: ఈ రకం వానాకాలంలో 120 – 125 రోజులు, యాసంగిలో 130 – 135 రోజులుగా పంట కాలం నమోదైంది. ఎకరాకు 25 – 27 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. అగ్గితెగులును కొంతమేర తట్టుకునే గుణం ఉంటుంది.

బీపీటీ–5204: ఈ రకం వరి పంట కాలం 135 – 150 రోజులు. ఎకరాకు 25 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. దీన్ని సాంబమసూరి లేదా సోనామసూరి అని పిలుస్తారు. ఈ పైరుకు ఉల్లికోడు ఆశించే అవకాశం ఉంటుంది.

డబ్ల్యూజీఎల్‌–44: ఇది వరంగల్‌ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ద్వారా అభివృద్ధి చేసిన రకం. దీని పంట కాలం 140 – 145 రోజులు. ఎకరాకు 28 – 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. సిద్ధి రకం కూడా పిలిచే ఇది వానాకాలం సాగుకు అనుకూలమైనది. ఈ రకం వరికి సుడిదోమ, అగ్గి తెగులు, కాండం తొలిచే పురుగు ఆశించే అవకాశం ఉంటుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement