అత్యాచార ఘటన బాధాకరం | - | Sakshi
Sakshi News home page

అత్యాచార ఘటన బాధాకరం

Jun 16 2026 12:28 AM | Updated on Jun 16 2026 12:28 AM

పాల్వంచ: ఖమ్మంలో చిన్నారిపై అత్యాచార ఘటన అత్యంత బాధాకరమని రజక సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపెల్లి దుర్గాప్రసాద్‌ అన్నారు. సోమవారం పాల్వంచలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని, కనీసం వారు స్పందించక పోవడం దారుణమని పేర్కొన్నారు. వైద్యానికి అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్పిన మంత్రుల మాటలు అమలు కావడం లేదని ఆరోపించారు. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టును పెట్టి నిందుతుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు పట్టా బాబూరావు, కంచర్ల రామారావు, శ్రీకాంత్‌, శ్రీనివాస్‌, సాయితేజ, ఆఫీజ్‌, ధనుశ్‌, రాజు, మహేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement