బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి,
నల్లగొండ ఇన్‌చార్జి ఉదయ్ ప్రతాప్
చుంచుపల్లి: జిల్లాలో ఎయిర్‌పోర్టు మంజూరుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా స్థలం చూపడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, నల్లగొండ ఇన్‌చార్జి సన్నె ఉదయ్ ప్రతాప్ అన్నారు. ఆదివారం కొత్తగూడెంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఆస్పిరేషన్ జిల్లా అయిన భద్రాద్రికి కేంద్రం రూ.50 కోట్ల నిధులు కేటాయించిందన్నారు. జాతీయ రహదారుల అభివృద్ధి, దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం అభివృద్ధికి ప్రసాద్ పథకం కింద రూ.90 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. దేశంలో అవినీతి లేకుండా ప్రధాని నరేంద్ర మోదీ సుస్థిర పాలన అందిస్తున్నారని అన్నారు. కొందరు ఎన్నికల ముందు తిట్టిన పార్టీలతో సీట్ల కోసం పొత్తులు పెట్టుకుంటారని విమర్శించారు. కార్పొరేటర్ చెరుకు భాగ్యలక్ష్మి, నాయకులు నంబూరి రామలింగేశ్వరరావు, డాక్టర్ జాటోత్ వెంకన్న, పూనెం భిక్షపతి, కృష్ణయ్య, పూనియా నాయక్, రామారావు, కుమార్, తుంపురి శివ, మోహన్ కృష్ణ గాయత్రి, పద్మ పాల్గొన్నారు.
నేడు ఇంటర్ అడ్మిషన్లకు స్పాట్ కౌన్సెలింగ్
పాల్వంచరూరల్: మండల పరిధిలోని కిన్నెరసాని గిరిజన గురుకుల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశానికి సోమవారం స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ శ్యామ్‌కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. భద్రాచలంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల్లో కౌన్సెలింగ్ ఉంటుందని, ఎంపీసీలో 40 సీట్లు, బైపీసీలో 80 సీట్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. సీఓఈ (సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్) కళాశాలలో ప్రత్యేక ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


