తాత్కాలిక క్యూలైన్ల ఏర్పాటు.. | - | Sakshi
Sakshi News home page

తాత్కాలిక క్యూలైన్ల ఏర్పాటు..

May 2 2026 7:38 AM | Updated on May 2 2026 7:38 AM

అభివృద్ధి పనుల్లో భాగంగా

ప్రస్తుత క్యూలైన్ల తొలగింపు..

స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా చర్యలు

స్వర్ణకవచాలతో భద్రాచల

రామయ్య స్వామి దర్శనం

భక్తుల రద్దీకి అనుగుణంగా

మజ్జిగ పంపిణీ చేయాలని విన్నపం

భద్రాచలం: శ్రీసీతారామచంద్ర స్వామివారి ఆల య అభివృద్ధి పనుల్లో భాగంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఉపాలయాల మూలమూర్తులను తరలించారు. నిర్మాణాలను తొలగించిన పక్షంలో ఇప్పుడు ఉన్న క్యూలైన్లను కూడా తొలగి స్తారు. దీంతో భక్తులకు దర్శనానికి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయానికి ఎదురుగా ఉన్న అభయాంజనేయస్వామి ఉపాలయానికి రెండు వైపులా తాత్కాలిక క్యూలైన్లను సిద్ధం చేస్తున్నారు. బేడా మండపంలో జరుగుతున్న నిత్యకల్యాణాలను సైతం మిథిలా స్టేడియంలోకి మార్చాలని ప్రణాళికలు రూపొందించారు. వీటికి సంబంధించిన తా త్కాలిక పనులు స్టేడియంలో జరగాల్సి ఉంది.

కమనీయం.. నిత్యకల్యాణం

శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థాన అంతరాలయంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణకవచాలతో దర్శనమిచ్చారు. తొలుత తెల్లవారుజాము న గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచ నం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. కార్మిక దినోత్సవం రోజు సెలవు దినం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో భద్రగిరి బాట పట్టారు.

మజ్జిగ నిరంతరాయంగా పంపిణీ చేయాలి

సుదూర ప్రాంతాల నుంచి ఎండలను సైతం లెక్క చేయకుండా భక్తులు రామయ్య దర్శనానికి వస్తున్నారు. అయితే వేసవి తాపంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరికి దేవస్థానం ఆధ్వర్యంలో క్యూలైన్‌ వద్ద ఉచితంగా మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. సాధారణ రోజుల్లో 50 లీటర్ల పెరుగు, శని, ఆదివారాల్లో భక్తుల రద్దీ దృష్ట్యా 80లీటర్ల పెరుగును ఉపయోగిస్తున్నారు. వేసవి సెలువులు ప్రా రంభం కావడంతో సాధారణ రోజుల్లో సైతం భక్తుల రద్దీ పెరిగింది. దీంతో 10 గంటల లోపే మజ్జిగ అయిపోతుండగా, భక్తులు దాహార్తితో అల్లాడిపోతున్నారు. మజ్జిగను నిరంతరాయంగా క్యూలైన్లలో దర్శనం నడిచినంత సమయం అందించేలా చర్యలు తీసుకోవాలని ఈఓ దామోదర్‌రావును భక్తులు కోరుతున్నారు.

వైభవోపేతంగా యోగానంద

లక్ష్మీ నరసింహ కల్యాణం

రామాలయానికి అనుబంధంగా ఉన్న యోగానంద లక్ష్మీ నరసింహ పాంచాహ్నిక తిరుకల్యాణోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం స్వామి వారి తిరుకల్యాణోత్సవం వైభవోపేతంగా జరిపా రు. తొలుత ఉదయం స్వామి వార్లకు అభిషేకం, హవనం నిర్వహించారు. సాయంత్రం కల్యాణతంతు కమనీయంగా జరిపారు. శనివారం రథోత్సవం, ఆదివారం సదస్యం, దొంగలదోపు, తెప్పోత్సవం నిర్వహించనున్నారు. సోమవారం ధ్వజావరోహ ణం, పుష్పయాగంతో ఉత్సవాలకు ముగింపు పలకనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement