నేడు మంత్రి పొంగులేటి పర్యటన | - | Sakshi
Sakshi News home page

నేడు మంత్రి పొంగులేటి పర్యటన

May 2 2026 7:38 AM | Updated on May 2 2026 7:38 AM

భద్రాచలం/దుమ్ముగూడెం: భద్రాచలం డివిజ నల్‌లో శనివారం రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 9.30గంటలకు దుమ్ముగూడెం మండలంలోని చిన్న బండి రేవు గ్రామంలో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం చింతగుప్ప నుంచి బురదమడుగు వరకు బీటీ రోడ్డుకు, ములకపాడులో మినీ ఇండోర్‌ స్టేడియం ప్రారంభోత్సవం, అథ్లెటిక్‌ ట్రాక్‌కు శంకుస్థాపన నిర్వహించనున్నారు. ఆ తర్వాత నర్సాపురం గ్రామంలో ప్రైవేట్‌ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఉదయం 11 గంటలకు భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో జరిగే అభివృద్ధి పనులను పరిశీలిస్తారని అధికారులు తెలిపారు.

వైభవంగా

చండీహోమం పూజలు

పాల్వంచరూరల్‌: పౌర్ణమిని పురస్కరించుకుని శుక్రవారం పెద్దమ్మతల్లి ఆలయంలో చండీ హోమం, పంచామృతాభిషేకం నిర్వహించా రు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి)ఆలయంలోఅమ్మవారికి పంచామృతంతో అభి షేక పూజలు జరిపారు. అనంతరం యాగశాలలో చండీహోమం పూజలు నిర్వహించారు. ముందుగా మేళతాళాలు, వేదమంత్రాలతో స్వామివారిని అర్చకులు ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఆ తర్వాత మండపారాధన, గణ పతి పూజ చండీహోమం చేశారు. చివరన పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. పూజలో పాల్గొన్న 15మంది భక్త దంపతులకు అర్చకులు అమ్మవారి శేష వస్త్ర ప్రసాదాలను అందజేశారు.

క్రీడలతో మానసికోల్లాసం

ఐటీడీఏ పీఓ రాహుల్‌

భద్రాచలం: విద్యార్థులు క్రీడల్లో పాల్గొంటే మానసికోల్లాసం, జ్ఞాపక శక్తి మెరుగుపడతాయని ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి బి రాహుల్‌ అన్నారు. శుక్రవారం ఐటీడీఏ ప్రాంగణంలో గిరిజన విద్యార్థులకు జరుగుతున్న క్రీడల సమ్మర్‌ కోచింగ్‌లో భాగంగా లాన్‌ టెన్నిస్‌ క్రీడలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థుతో రోజూ సాధన చేయించాలన్నారు. అనంతరం విద్యార్థులతో సరదాగా లాన్‌టెన్నిస్‌ ఆడారు. ఈ కార్యక్రమంలో గోపాలరావు, వసంత్‌, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): కార్మికులకు తెలంగాణ భవన, ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా కల్పిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కార్మిక శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ షర్ఫుద్దీన్‌ అన్నారు. కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని క్లాత్‌ మర్చంట్‌ అండ్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ హాల్‌లో మేడే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ పథకాలను వివరించారు. ఐటీఐ ప్రిన్సిపాల్‌ రమేష్‌ మాట్లాడుతూ నైపుణ్యం కలిగిన కార్మిక శక్తిని పెంచేందుకు ప్రభుత్వం అడ్వాన్స్‌ టెక్నాలజీ సెంటర్ల ను ఏర్పాటు చేసిందన్నారు. అనంతరం కొత్తగూడెం ఏటీసీ అసిస్టెంట్‌ ట్రైనింగ్‌ ఆఫీసర్‌ డి హరీష్‌కు ఉత్తమ సేవా అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు బీఎన్‌ రాజు, పీవీకే శాస్త్రి, ధర్మాచారి, రవి, వై శ్రీనివాసరావు, కార్మిక సంఘాల నాయకులు నరాటి ప్రసాద్‌, బి పరమేష్‌, లక్ష్మణ్‌ నాయక్‌, పోగుల కోటేశ్వరరావు, చందర్‌రావు, నరసింహారావు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement