అశ్వారావుపేటరూరల్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న భూ భారతి చట్టం ద్వారా జిల్లాలోని అశ్వారావుపేటలో తొలి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసి, తొలిసారిగా భూదార్ నంబర్ కేటాయించారు. అశ్వారావుపేట రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 229/అ1/2లోగల 3ఎకరాలసాగు భూమిని పట్టణ కేంద్రానికి చెందిన ఆండ్రి శ్రీదేవి అనే మహిళా రైతు ఏపీలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన జుజ్జవరపు శ్రీనివాసరావుకు విక్రయించారు. దీంతో భూమి హద్దులతో కూడిన మ్యాప్‌ను జతచేసి తహసీల్దార్ కార్యాలయంలో తొలిసారి రిజిస్ట్రేషన్ ప్రక్రి య పూర్తి చేశారు. భూ కమత పటం–1, భూదార్ నంబర్ కూడా కేటాయించినట్లు భూ భారతి పైలట్ ప్రాజెక్టు మండల ప్రత్యేకాధికారి కోట రవికుమార్ తెలిపారు. అనంతరం ఆయా పత్రాలను బాధ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయబ్ తహసీల్దార్ రామకృష్ణ, మండల సర్వేయర్ నాగరాజు పాల్గొన్నారు.
అశ్వారావుపేటలో
భూదార్ నంబరు సైతం కేటాయింపు


