కొత్తగూడెంఅర్బన్/సూపర్‌బజార్(కొత్తగూడెం)/రుద్రంపూర్: గౌతమ బుద్ధుడు చూపిన శాంతి, సహనం, ప్రాణికోటి పట్ల దయ జాలి, అహింస, వంటి పంచశీల సూత్రాలు, అష్టాంగ మార్గాలు అనుసరణీయమని బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర నాయకుడు, అంబేడ్కర్ జాతీయ ఫెలోషిప్ అవార్డ్ గ్రహీత సిద్దెల రవి అన్నారు. కొత్తగూడెంలో శుక్రవారం నిర్వహించిన గౌతమ బుద్ధుని జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడారు. ధర్మరాజు, రాజేశ్వరరావు, రామ రాజు, క్రాంతి, దుర్గ, మనోజ్, లక్ష్మి, విజయ, ఫాతిమా పాల్గొన్నారు.
కారుకొండ రామవరంలో..
లక్ష్మీదేవిపల్లి మండలంలోని కారుకొండలో బౌద్ధ ఆరామాల వద్ద గౌతమ బుద్ధుని జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎ.నాగేశ్వరరావు, మాలతి, కోట శ్రీనివాసరావు, జిమ్మిడి మల్లేష్, రవికుమార్, నాగరాజు, సుమన్ పాల్గొన్నారు.
అంబేడ్కర్ జాతీయ ఫెలోషిప్ అవార్డు గ్రహీత సిద్దెల రవి


