సుజాతనగర్: ఎదురెదురుగా రెండు ద్విచక్రవాహనాలు ఢీకొనగా ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని రూప్లాతండాకు చెందిన అజ్మీరా రవి (35) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం సర్వారంలో జరిగిన కార్యక్రమానికి హాజరై ద్విచక్రవాహనంపై తిరిగి ఇంటికి వెళ్తున్నాడు. కాగా, కొత్త అంజనాపురానికి చెందిన శేషగిరిరావు సర్వారం వైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. స్థానిక వాగు సమీపంలో ఎదురెదురుగా ద్విచక్రవాహనాలు ఢీకొనడంతో రవి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఎం.రమాదేవి తెలిపారు.
ఒకరు మృతి


