నేడు భద్రాచలం డీఎస్పీ బాధ్యతల స్వీకారం | - | Sakshi
Sakshi News home page

నేడు భద్రాచలం డీఎస్పీ బాధ్యతల స్వీకారం

May 2 2026 7:38 AM | Updated on May 2 2026 7:38 AM

భద్రాచలంఅర్బన్‌: భద్రాచలం డీఎస్పీగా ఇటీవల నియమితులైన అరుణ్‌ కుమార్‌ శనివా రం బాధ్యతలు స్వీకరించనున్నా రు. 2009 బ్యాచ్‌ కు ఈయన గతంలో జిల్లాలోని పలు పోలీస్‌ స్టేషన్లలో ఎస్‌ఐగా పనిచేశారు. గత నెల 27న రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన డీఎస్పీల బదిలీల్లో భాగంగా హైదరాబాద్‌ ఇంటెలిజెన్స్‌ విభాగంలో పనిచేస్తున్న అరుణ్‌కుమార్‌ను భద్రాచలం బదిలీ చేశారు. కాగా, ఇప్పటివరకు భద్రాచలం ఏఎస్పీగా పనిచేసిన విక్రాంత్‌కుమార్‌ సింగ్‌ను పదోన్నతిపై రాష్ట్ర ప్రభుత్వం మెదక్‌ జిల్లా అదనపు ఎస్పీగా బదిలీ చేసిన విషయం విదితమే. ఆ సమయంలో భద్రాచలానికి గతంలో లాగా ఐపీఎస్‌ అధికారిని నియమించలేదు. ఆ స్థానంలో డీఎస్పీని నియమించింది.

అవకాశాలను

అందిపుచ్చుకోవాలి

కొత్తగూడెంఅర్బన్‌: రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలని గ్రంథాలయ చైర్మన్‌ వీరబాబు సూచించారు. శుక్రవారం గ్రంథాలయంలో జరిగిన సమావేశంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత తో మాట్లాడారు. మే 4వ తేదీన ఉమ్మడి ఖమ్మం జిల్లా జాబ్‌మేళాకు మంచి కంపెనీలు వస్తున్నాయన్నారు. యువత పాల్గొని, ఉద్యో గాలు సంపాదించాలని ఆకాంక్షించారు. కార్య క్రమంలో గ్రంథపాలకులు జి.మణిమృదుల తదితరులు పాల్గొన్నారు.

అటవీశాఖలో బదిలీల ప్రక్రియ షురూ..

పాల్వంచరూరల్‌: పాల్వంచ వైల్డ్‌లైఫ్‌ డివిజన్‌ పరిధిలోని నాలుగు రేంజ్‌లలో మూడు, నాలుగేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగుల సీనియార్టీ జాబితాను సిద్ధం చేస్తున్నట్లు ఎఫ్‌డీఓ బాబు తెలిపారు. డివిజన్‌లో ఎక్కువ సంవత్సరాలుగా పనిచేస్తున్నవారిలో రేగళ్ల రేంజర్‌ యశ్వంత్‌కుమార్‌ ఉన్నారు. 16 మంది బీట్‌ ఆఫీసర్లు, 3 సెక్షన్‌ ఆఫీసర్లు లాంగ్‌ సర్వీస్‌గా విధులు నిర్వర్తిస్తున్నట్లు గుర్తించి బదిలీకి సిఫార్సు చేశారు. ఎక్కువ ఏళ్లు ఒకే ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగుల జాబితాను రూపొందించి, డీఎఫ్‌ఓకు పంపితే ఆయన పరిశీలించి సీసీఎఫ్‌కు పంపనున్నారు.

బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు

నేలకొండపల్లి: మండలంలోని ఓ గ్రామంలో బాలికకు వివాహం జరగనుందనే సమాచారంతో అధికారులు అడ్డుకున్నారు. ఇటీవలే పదో తరగతి పూర్తిచేసిన బాలిక (16)కు ఆమె కుటుంబీకులు వివాహం నిర్ణయించి ఈ నెల 8న ముహూర్తం ఖరారు చేశారు. ఈ విషయమై అందిన సమాచారంతో ఏఎస్‌ఐ లతీఫ్‌ షరీఫ్‌ తదితరులు శుక్రవారం బాలిక ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. మైనార్టీ తీరకుండా వివాహం చేయడం చట్టరీత్యా నేరమే కాక భవిష్యత్‌లో ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలిపారు. ఆపై బాల్యవివాహం చేయబోమని కుటుంబీకుల నుంచి లేఖ తీసుకున్నారు. పంచాయతీ కార్యదర్శి హరీశ్‌, జీపీఓ జానకీరాములు, అంగన్‌వాడీ టీచర్‌ కళావతి తదితరులు పాల్గొన్నారు.

రిటైర్డ్‌ ఉద్యోగులకు సన్మానం

ఖమ్మంక్రైం: పోలీసు శాఖలో విధులు నిర్వర్తించిన పలువురు ఉద్యోగులు, హోంగార్డులు గురువారం ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా వీరిని పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌దత్‌ శుక్రవారం సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఉద్యోగ విరమణ చేసిన వారిలో ఎస్‌ఐలు నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు, వేణుగోపాల్‌రెడ్డి, శ్రీనివాసరావు, ఏఎస్‌ఐలు ఆర్‌వీవీ బ్రహ్మచారి, సత్యనారాయణ, హెడ్‌కానిస్టేబుల్‌ యాసిన్‌మియా, హోంగార్డులు లోకమ్మ, వీరస్వామి తదితరులు ఉన్నారు.

రిటైర్డ్‌ ఉద్యోగి

చికిత్సకు చేయూత

ఖమ్మంక్రైం: ఎస్‌ఐగా విధులు నిర్వర్తించిన ఉద్యోగ విరమణ చేసిన మౌలానా అనారోగ్యంతో బాధపడుతుండగా పలువురు అండగా నిలిచారు. ఈమేరకు వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న పోలీసు ఉద్యోగులు, రిటైర్డ్‌ అధికారులు ఆయన చికిత్స కోసం రూ.1.50లక్షలను సమకూర్చారు. ఆయనకు ఆర్థికసాయం అందించిన వారిలో పోలీసు అధికారులు చక్రపాణి, శ్రీనివాస్‌రెడ్డి, ఎస్వీ.రమణమూర్తి, శేషుకుమార్‌, పీ.వీ.గణేష్‌, మోహన్‌రాజ, నరేష్‌రెడ్డి, సతీష్‌, వెంకటరావు, బిల్లా అశోక్‌ తదితరులు ఉన్నారు. వీరికి రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఆర్‌.రాధాకృష్ణమూర్తి, రుద్ర వెంకటనారాయణ కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement