కార్మిక హక్కులపై కేంద్రం కగార్‌ కత్తి | - | Sakshi
Sakshi News home page

కార్మిక హక్కులపై కేంద్రం కగార్‌ కత్తి

May 2 2026 7:38 AM | Updated on May 2 2026 7:38 AM

మోదీ కోసం కమ్యూనిజాన్ని

తిడుతున్న చంద్రబాబు

బీజేపీ హయాంలో నయా బానిసలుగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు

సీపీఐ జాతీయ నాయకుడు

డాక్టర్‌ నారాయణ

ఖమ్మంమయూరిసెంటర్‌: రక్తపు మడుగుల నుంచి పుట్టిన ఎరజ్రెండా ప్రపంచ గతినే మార్చిందని, ఎని మిది గంటల పని విధానాన్ని సాధించి పెట్టిన ఆ జెండా ఉనికిని దెబ్బతీసేలా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మికులను మళ్లీ బానిసలుగా మారుస్తోందని సీపీఐ జాతీయ కంట్రోల్‌ కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ కె.నారాయణ ధ్వజమెత్తారు. ఖమ్మంలో శుక్రవారం నిర్వహించిన మే డే ఉత్సవాల్లో ఆయన మా ట్లాడారు. బ్రిటీష్‌ కాలంలో సాధించుకున్న హక్కు లు, పనిగంటల చట్టాలను కేంద్రం తుంగలో తొక్కు తోందని మండిపడ్డారు. ఐటీ రంగంలో ఉద్యోగులు ప్రస్తుతం క్లాసిఫైడ్‌ బానిసలుగా మారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్క్‌ ఫ్రం హోం పేరుతో 20 – 22 గంటల పాటు కంప్యూటర్లకే అతుక్కుపోయేలా చేస్తున్నారన్నారు. మరోపక్క అడవి బిడ్డలను ఖాళీ చేయించి, అక్కడి సహజ సంపదను అదానీ, అంబానీలకు కట్టబెట్టడమే లక్ష్యంగా కేంద్రం ఆపరేషన్‌ కగార్‌ చేపట్టిందని ఆరోపించారు. మావోయిజం పేరుతో గిరిజనులను వేధిస్తున్నా.. సిద్ధాంతాన్ని మాత్రం తుపాకులతో అణచలేరని పేర్కొన్నారు. కాగా, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రధాని మోదీని ప్రసన్నం చేసుకునేందుకు కమ్యూనిజాన్ని తిడుతున్నారని, ఇది కొంగ జపం లాంటిదేనని నారాయణ ఎద్దేవా చేశారు. కొడుక్కి రాజ్యం అప్పగించి బాబు ప్రధానమంత్రి కావాలని అనుకుంటుండగా, ఆయన ఎంత కాకా పట్టినా మోదీ దగ్గరకు రానివ్వడన్నారు. బీజేపీకి అనుకూలంగా ఉంటే ఎంతటి నేరగాడైనా గంగి గోవులా కనిపిస్తాడని, వ్యతిరేకిస్తే కేజ్రీవాల్‌ మాదిరి జైలులో పెడతారని దుయ్యబట్టారు. ఇక కేసీఆర్‌ అహంభావం, కుటుంబ పాలనతోనే బీఆర్‌ఎస్‌ సంక్షోభంలో పడిందని తెలిపారు. కేబినెట్‌లో తెలంగాణ ద్రోహులకు చోటు కల్పించి తెలంగాణ సెంటిమెంట్‌ను కేసీఆరే దెబ్బతీశారని తెలిపారు. సొంత కూతురే తండ్రిని విమర్శించే స్థాయికి వారి కుటుంబ కలహాలు చేరాయని పేర్కొన్నారు. దేశంలో దారిద్య్రం లేని ఏకై క రాష్ట్రంగా కేరళ నిలిచిందని, అది లెఫ్ట్‌ ఫ్రంట్‌ ప్రభుత్వ ఘనతేనని నారాయణ కొనియాడారు. కార్యక్రమంలో సీపీఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి దండి సురేశ్‌, నాయకులు మహమ్మద్‌ మౌలానా, జమ్ముల జితేందర్‌రెడ్డి, జానీమియా, శింగు నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement