దుమ్ముగూడెం: రాష్ట్ర ప్రజలు రేవంత్‌రెడ్డి పాలన అంతం కావాలని, మళ్లీ కేసీఆర్‌ను సీఎంగా చూ డా లని అనుకుంటున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ జోస్యం చెప్పారు. శుక్రవారం లక్ష్మీనగరం గ్రామంలో జరిగిన దుమ్ముగూడెం, చర్ల, భద్రాచలం మండలాల బీఆర్‌ఎస్ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావుతో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని, భూదందాలు, అక్రమ మైనింగ్‌తో ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని, పేదల ఇళ్లు కూల్చి ఆనందం పొందుతున్నారని విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక కేసీఆర్‌పై నిందలు వేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో రావులపల్లి రాంప్రసాద్, మానె రామకృష్ణ, సాగి వాసురాజు, రేసు లక్ష్మి, కణితి రాముడు, జానీపాషా, అపకా వీర్రాజు, రావులపల్లి పృథ్వీ, లంక శివ, జోగా బుజ్జి, కొత్త మల్లేశ్వరరావు, వాగే కృష్ణ, తునికి కామేశ్, సర్పంచ్‌లు వాగే ఖాదర్‌బాబు, మడకం జోగయ్య, గుండి రవి తదితరులు పాల్గొన్నారు.
కార్మికులకు అండగా ఉంటాం..
బూర్గంపాడు: ఐటీసీ సారపాకలో కొనసాగుతున్న కాంట్రాక్ట్ కార్మికుల నిరసనలకు శుక్రవారం బీఆర్‌ఎస్ మద్దతు తెలిపింది. కాంట్రాక్ట్ కార్మికుల రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సందర్శించి సంఘీభావం తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, బీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు సాని కొమ్ము శంకర్‌రెడ్డి, సర్పంచ్ సరోజ రాందాస్, జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కోకన్వీనర్ సానికొమ్ము రామచంద్రారెడ్డి, బీఆర్‌టీయూ నాయకులు కుందూరు పెద్దిరెడ్డి, సింగరపు సతీశ్, జేఏసీ సభ్యులు మేకల శేషమ్మ, రామిశెట్టి లక్ష్మి, కోడూరు శ్రీనివాసరావు, చుక్కపల్లి బాలాజీ, వీరంరెడ్డి సీతారామిరెడ్డి, గల్లా ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్


