అడవిలో రాజుకొని పంటలను చుట్టేసి.. | - | Sakshi
Sakshi News home page

అడవిలో రాజుకొని పంటలను చుట్టేసి..

May 2 2026 7:38 AM | Updated on May 2 2026 7:38 AM

ఇల్లెందురూరల్‌: మండలంలోని ఒడ్డుగూడెం గ్రామపంచాయతీ పొలాలను శుక్రవారం మంటలు చుట్టుముట్టాయి. నెహ్రూనగర్‌తండా సమీపంలోని అటవీప్రాంతంలో అటవీశాఖ జామాయిల్‌ తోటలో రాజుకున్న మంటలు క్రమంగా నెహ్రూనగర్‌, ఒడ్డుగూడెం మీదుగా చెన్నంగలగడ్డ గ్రామ శివారు వరకు పొలం గట్లను వ్యాపించాయి. మంటల్లో పలువురు రైతుల చేలల్లో కుప్పగా ఉంచిన మొక్కజొన్న కంకులు పూర్తిగా దగ్ధమయ్యాయి. తన రెండు ఎకరాల్లో మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైందని రైతు మంగీలాల్‌ చేను వద్దే కన్నీరుమున్నీరయ్యారు. చేలల్లో సాగునీటి కోసం వేసుకున్న బోర్లు, చేలల్లో పరిచిన పైపులు కూడా పూర్తిగా దగ్ధమయ్యా యి. ఇంతజరుగుతున్నా మంటలను అరికట్టేందుకు గ్రామ పంచాయతీ అధికారులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో రైతులు ఫైర్‌స్టేషన్‌కు ఫోన్‌చేయగా.. వారు వచ్చి మంటలు ఆర్పే యత్నం చేసినప్పటికీ ఫైర్‌ఇంజన్‌లో నీరు ఖాళీ అయ్యింది. నీటి కోసం రైతులు గ్రామపంచాయతీ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు ఖాళీ ట్యాంకర్‌తో అక్కడకు రాగా.. రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, రూ.లక్షల్లో రైతులు నష్టపోయినట్లు స్థానికులు చెబుతున్నారు.

భారీ అగ్నిప్రమాదంతో రైతులకు తీరని నష్టం

Advertisement
 
Advertisement
Advertisement